Health

యువతకు చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఇదే.

గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. అయితే ఈ మధ్య యువత గుండె పోటు తో చనిపోతున్నారు.. అందుకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

గుండెకు సరిగ్గా రక్త సరఫరా జరగక్క పోవడంతోనే మరణిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.రక్తం పంప్ చేయడంతో.. గుండె కండరాలు(కార్డియాక్ మజిల్స్) ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. అతి బలమైన కండరం కూడా ఇదే. అయితే గుండె సంకోచ, వ్యాకోచాలకు సవ్యంగా జరగకుండా చేసే ప్రధాన శత్రువు మనం తినే ఉప్పు.. ఉప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని ఆరోగ్యం నిపుణులు అంటున్నారు.

ఆహారపు అలవాట్లు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తున్నాము.. ముఖ్యంగా చెప్పాలంటే.. ఊరగాయలను, తినే కూరలను పక్కనబెడితే… మొక్కజొన్న పొత్తుల్లో, జామ కాయల్లో, మామిడి కాయల్లో, నేరేడు కాయల్లో.. ఇలా అన్నింటికి టచ్చింగ్‌గా ఉప్పును తింటున్నారు చాలామంది. దీంతో గుండె కణజాలంలో కూడా ఉప్పు శాతం పెరుగుతుంది. ఆ ఉప్పుకు గట్టి పరిచే గుణం ఉంటుంది.

అందుకే గుండె సాగే గుణాన్ని కోల్పోతుంది.. దాంతో ముడుచుకొని పోతుంది.. ఒక గడిచే కొద్దీ కార్డియాక్ మజిల్.. బయటకు పంపే రక్తం మోతాదు తగ్గిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది బరువు పనులు చేయలేరు. కనీసం మెట్లు కూడా ఎక్కలేరు. చిన్న, చిన్న పనులు చేసి కూడా ఆయాసపడతారు.. దాంతో ఊపిరి కూడా కష్టం అవుతుంది..అందుకే గుంండెపోటు లు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

అందుకే దానిపై ప్రధానమైన అటెన్షన్ పెట్టమని చెబుతున్నారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు. యువత హఠాత్తుగా కుప్పకూలిపోవడానికి ఉప్పే ప్రధాన కారణమని ఆయన చెబుతున్నారు..నిజానికి ఇదొక్కటే కాదు ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి.. ఏదైనా మితంగా తీసుకోవడం మంచిది.. ఇది తప్పక గుర్తుంచుకోండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker