మీ గోళ్లు ఇలా మారాయా..! వెంటనే మీరు ఏం చ్చేయ్యాలంటే..?
చేతి గోళ్లు రంగు కోల్పోయి పాలిపోయినట్లుగా ఉంటే మీలో రక్తహీనత సమస్య ఉన్నట్లు అర్ధం చేసుకోవాలి. ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గడం వల్ల గోళ్లు పాలిపోయినట్లుగా కనిపిస్తాయి.శరీరంలో ఐరన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. కూరగాయలు, మాంసం ఎక్కువగా తినాలి. అంతేకాదు గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే కిడ్నీ, డయాబెటిస్, లివర్ సమస్యలకు ముందస్తు లక్షణాలుగా భావించాల్సి ఉంటుంది. అయితే అయినా చాలా మందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
గోళ్ల శుభ్రతను నిర్లక్ష్యం వహించడం వల్ల అనారోగ్య సమస్యలే కాకుండా అనుకోకుండా శరీరంపై గీచుకపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు నెయిల్ పెయింట్స్ సహాయంతో గోళ్లను అందంగా మార్చుకుంటారు. కానీ అబ్బాయిలు మాత్రం వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదు. గోళ్లలో పేరుకుపోయిన మురికి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పురుషుల్లో గోళ్లు పెరిగి పసుపు రంగులో మారుతున్నాయి.
గోళ్లలో మురికి తొగిపోవడానికి నిమ్మరసంలో కొంత సేపు ముంచి ఉంచండి.. ఆ తర్వాత బ్రష్‌తో రుద్దండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే గోళ్లు అద్భుతమైన మెరుపును పొందుతాయి. అయితే గొళ్లను శుభ్రం చేసే క్రమంలో తప్పకుండా జాగ్రత్త వహించండి. ల్లుల్లిని ఉపయోగించి కూడా గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. కావున గోళ్లను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. నిమ్మరసం, ఉప్పు మిక్స్ చేసి బ్రష్ సహాయంతో గోళ్లపై రుద్దితే గోళ్లపై ఉన్న మరకలు తొలగిపోతాయి.
నిమ్మరసం, బేకింగ్ సోడా కూడా గోళ్లపై మొండి మరకలను తొలగిస్తుంది. గోళ్ల పసుపు రంగును తొలగించేందుకు వైట్ వెనిగర్ కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. గోళ్ల మెరుపును కూడా పెంపొందిస్తుంది. దంతాలను శుభ్రం చేయడానికి టూత్ పేస్ట్ ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పెరాక్సైడ్ గోళ్ల మరకలను కూడా తొలగిస్తుంది. కావును దీనిని ఉపయోగించి గోళ్లను కూడా శుభ్ర చేయవచ్చు. కొబ్బరి నూనెను తరచుగా జుట్టు, చర్మానికి వినియోగిస్తారు. అయితే దానిని వేడి చేసి గోళ్లపై మసాజ్ చేస్తే గోళ్లు శుభ్రమవుతాయి.