Life Style

శానిటరీ ప్యాడ్ వాడటంలో మహిళలు చేస్తున్న తప్పులు ఇవే.

శానిటరీ ప్యాడ్‌ల వాడకం వల్ల పర్యవరణానికే కాదు మహిళల ఆరోగ్యానికీ కూడా చాలా హాని ఉందని తేలింది. ఓ ఎన్జీవో నిర్వహించిన పరిశోధనల్లో ఈ షాకింగ్ విషయం బయటపడింది. శానిటరీ ప్యాడ్‌లో ఉన్న కొన్ని రసాయనాలు మహిళల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నట్టు తేలిందట. అయితే పీరియడ్స్ సమయంలో ఆడవాళ్లకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కడుపు నొప్పి, తిమ్మిరి, మూడ్ స్వింగ్స్, అలసట, బలహీనత వంటి సమస్య వస్తాయి. ఇవి సర్వసాధారణమే అయినా.. పీరియడ్స్ టైంలో పరిశుభ్రతను పాటించాలి. లేదంటే లేని పోని సమస్యలు వస్తాయి. నెలసరి సమయంలో శరీరం నుంచి బ్యాక్టీరియా విడుదలవుతుంది.

ముఖ్యంగా శానిటరీ ప్యాడ్ ను 4 గంటలకోసారి మార్చకపోతే ఎన్నోసమస్యలు వస్తాయి. అందుకే ప్రతి నాలుగు గంటలకు ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్ ను మార్చాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా మంది ఆడవారు తమ రక్తప్రవాహాన్ని బట్టి ప్యాడ్లను మారుస్తారు. ఏదేమైనా రక్తప్రవాహం ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా ప్రతి 4 గంటలకు ప్యాడ్ ను ఖచ్చితంగా మార్చాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. బ్లీడింగ్ అవ్వట్లేదని ప్యాడ్ ను రోజంతా అలాగే ఉంచుకుంటే మీకు అంటువ్యాధులు వస్తాయి.

అంతేకాదు యోనికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయ. ల్యూకోరియా.. ల్యూకేరియా అంటే యోని నుంచి తెల్లగా లేదా పసుపు రంగులో వచ్చే స్రావం. దీనివల్ల ఆడవాళ్లు బలహీనంగా అవుతాయి. బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్యాడ్ ను సకాలంలో మార్చకపోవడం వల్లే ల్యూకేమియా వస్తుంది. యోని దురద.. చర్మ సంక్రమణకు ఏకైక కారణం చర్మం దురద. ఒకే ప్యాడ్ ను రోజంతా లేదా 4 గంటలకు మించి వాడితే చర్మంపై దద్దుర్లు, చికాకు కలుగుతుంది. ఫలితంగా మీకు భరించలేని దురద, మండుతున్న అనుభూతి కలుగుతుంది.

చర్మ దద్దుర్లు.. యోనిలో లేదా చుట్టుపక్కల దద్దుర్లు రావడానికి ప్రధాన కారణాలలో సరైన పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఉంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో. ప్యాడ్ మార్చకపోవడం వల్ల ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది దద్దుర్లు, చికాకును కలిగిస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదం.. నిపుణుల ప్రకారం.. సమయానికి ప్యాడ్లను మార్చకపోతే యుటిఐ సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంది. యూటీఐ సమస్యలో మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం, మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్ ఉన్నాయి. దీనివల్ల మూత్ర విసర్జనలో మంట, పొత్తికడుపులో నొప్పి, యోని నుంచి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి.

చర్మం ఊడిపోవచ్చు.. తడిగా ఉండే ప్యాడ్ ను ఎక్కువ సేపు ఉంచుకోవడం వల్ల చర్మపు చికాకు కలుగుతుంది. అంతేకాదు చర్మం ఊడిపోవడం ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మ ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. దుర్వాసన.. మీరు సమయానికి ప్యాడ్ ను మార్చకపోతే ప్యాడ్ నుంచి చెడు వాసన రావడం ప్రారంభమవుతుంది. చాలా రోజుల వరకు యోని నుంచి చెడు వాసన వస్తుంది. కానీ పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే బ్యాక్టీరియా వల్ల అక్కడి నుంచి కుళ్లిన వాసన వస్తుంది. ఇది ఇతరులను ఇబ్బంది పెడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker