చంకల్లో నలుపుని సులభంగా తొలగించే వంటింటి చిట్కాలు.
తక్కువ సమయంలో చంకల్లో నలుపు తగ్గించడానికి కొన్ని రకాల పొడులను ఉపయోగించి నలుపు తగ్గించుకోవచ్చు. చంకల్లో నలుపు తగ్గించడానికి బంగాలదుంప ను ఉపయోగించి పోగొట్టవచ్చు. బంగాళాదుంపను ఉపయోగించడం వల్ల చంకల్లో నలుపు ఎలా తగ్గుతుందో. వాటిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం. బేకింగ్ సోడా అండర్ ఆర్మ్స్‌లోని నలుపుని దూరం చేసే ఉత్తమమైన హోం రెమిడీ. ఇందుకోసం బేకింగ్ సోడాను నీటితో బాగా కలపి చిక్కటి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు మీ అండర్ ఆర్మ్స్‌లో అప్లై చేయాలి.
చర్మాన్ని కాంతివంతం చేసే విటమిన్ ఇ లేదా కొబ్బరి నూనెతో మీ అండర్ ఆర్మ్స్‌ను ప్రతిరోజూ పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసే క్రమంగా చంకల్లో ఉన్న నలుపు పోతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దీనిని బేకింగ్ సోడాతో కలపి చంకల్లో అప్లై చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచి, ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌కి, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ కలపి రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
నిమ్మకాయను సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. ప్రతి రోజూ రెండు మూడు నిమిషాల పాటు స్నానం చేసే ముందు అర నిమ్మచెక్క తీసుకుని నల్లగా ఉన్న ప్రదేశంలో రుద్దితే మార్పు వస్తుంది. బంగాళదుంప కూడా సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. బంగాళ దుంపని స్లైసులుగా కట్ చేసిగానీ లేదా, రసాన్నిగానీ మీ చంకలో అప్లై చేసి 10-15 నిమిషాలు ఉంచాలి. మెరుగైన ఫలితాల కోసం, దీన్ని రోజుకు రెండుసార్లు ఉపయోగించొచ్చు.
అలోవెరా జెల్‌ను అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయ వచ్చు. మీకు వెనిగర్ అలర్జీ లేకపోతే, బియ్యపు పిండిలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి చిక్కని పేస్ట్ తయారు చేసి అప్లై చేయాలి. 20 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. పెరుగు, నిమ్మరసం, పసుపు, శెనగపిండి మిశ్రమంతో చేసిన ప్యాక్‌ను అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చంకల్లో నలుపు పోయేందుకు ప్రతి రోజూ చేయడం అవసరం.