ఈ యోగాసనాలతో మీ వెన్నునొప్పి నిమిషాల్లో తగ్గిపోతుంది.
వెన్నునొప్పిలో ఎక్కువభాగం గుర్తించదగిన కారణాలు లేవు. అనేక రకాల వైద్య సమస్యలకు ఇది ఒక లక్షణంగా భావించాలి. కీళ్ళు బలహీనపడి, కండరాలు, నరాలలో నొప్పిని కలిగిస్తాయి. పిత్తాశయం, క్లోమం, బృహద్ధమని, మూత్రపిండాల వ్యాధి, వాపు కూడా వెనుకభాగంలోని నొప్పికి కారణం కావచ్చు. మీరు వెన్నునొప్పితో బాధపడుతుంటే యోగా చేయవచ్చు అంటున్నారు డాక్టర్లు. యోగా అనేది మైండ్-బాడీ థెరపీ. ఇది వెన్నునొప్పి, ఒత్తిడిని నయం చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది.
దీనివల్ల మీ శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా బలపడుతుంది. అందుకే ప్రతిరోజూ కొంతసేపు యోగా చేస్తే మంచిది. దీనివల్ల మీరు మీ గురించి, మీ శరీరం గురంచి కొంత తెలుసుకోవచ్చు. ఫలితంగా మీ టెన్షన్ పాయింట్లను, అసమతుల్యతలను మెరుగ్గా గుర్తించగలుగుతారు. అయితే మర్జారియాసన (పిల్లి భంగిమ)..ఈ సరళమైన భంగిమ.. మీ వెన్నెముకను పొడిగిస్తుంది. ఇది మీ వెన్నెముకను సరి చేయడంలో సహాయం చేస్తుంది. దీని వల్ల మీ శరీరం, భుజాలు, మెడను సాగదీయవచ్చు.
ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. అథో ముఖ స్వనాసన..ఈ క్లాసిక్ ఫార్వర్డ్ బెండ్ మీకు ప్రశాంతతను ఇస్తుంది. అథో ముఖ స్వనాసన వల్ల వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇది మీ వెన్నుముఖను బలపరుస్తుంది. త్రికోనాసన..వెన్నులో అసౌకర్యం, సయాటికా, మెడ నొప్పి ఉన్నవారు ఈ త్రికోనాసన ద్వారా.. మీరు తగ్గించుకోవచ్చు. దీనిని మీరు చాలా సింపుల్గా చేయగలుగుతారు. ఇది మీ వెన్నెముక, తుంటి, గ్రోయిన్‌ను సాగదీసేటప్పుడు మీ భుజాలు, ఛాతీ, కాళ్లను బలపరుస్తుంది.
అదనంగా ఇది ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. sphinx pose..ఈ తేలికపాటి బ్యాక్‌బెండ్ ద్వారా మీ వెన్నెముక, పిరుదులు బలపడతాయి. మీ ఛాతీ, భుజాలు, ఉదరం విస్తరించవచ్చు. ఇది వెన్నునొప్పిని తగ్గించడమే కాకుండా.. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. కోబ్రా పోజ్..మీ ఛాతీ, ఉదరం, భుజాలు ఈ మితమైన ఆసనంతో ప్రయోజనం పొందుతాయి. ఈ భంగిమ సయాటికాతో సహాయపడుతుంది. మీ వెన్నెముకను బలపరుస్తుంది. ఇది తరచుగా వెన్నునొప్పితో పాటు వచ్చే ఒత్తిడి, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.