News

రోడ్ సైడ్ కిరాణా షాప్ లో యశ్ షాపింగ్, భార్య కోసం యష్ ఏం కొన్నాడో తెలుసా..?

ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ గా ఉన్నా.. తన ఫ్యామిలీ కోసం..ఫ్యాన్స్ కోసం ఎన్ని మెట్లు అయినా దిగి వస్తాడు. మధ్యతరగి నుంచి వచ్చిన ఈ హీరో.. తన జీవితాన్ని మర్చిపోలేదు. అందుకే తన భార్య కోసం రెండు మెట్లు ఎక్కువే దిగి వచ్చాడు. సాధారణ జనంలోకలిసి పోయి.. ఆమె కోరిక తీర్చాడు. తన భార్య కోసం, కూతురి కోసం కారు దిగిన యశ్..

రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్‌లో క్యాండీ కొని తన భార్యతో పాటు.. గారాల పట్టీకి అందిచ్చాడు.యష్ భార్య రోడ్డు పక్కన చిన్న కిరాణా కొట్టు దగ్గర కూర్చుని ఐస్ తింటోంది. అక్కడే ఉన్న యష్ ఆమెకు ఐస్, చాక్లెట్స్ కొనిస్తూ ఉన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల యష్ దంపతులు చిత్రపుర మఠం ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.

ఆ సందర్భంగా భార్య రాధిక అడిగిందని యష్ అలా రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో ఐస్ కొనిచ్చాడు. ఇంతటి స్టార్డమ్, పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ వచ్చినా కూడా ఇంత సింపుల్ గా ఎలా ఉండగలుగుతున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. పైగా యష్ కొనిచ్చాడు సరే.. రాధిక కూడా చక్కగా కూర్చుని తినేస్తోంది. నిజంగా సింప్లిసిటీ అనే పదానికి ఈ దంపతులు నిలువెత్తు రూపం అంటూ పొగిడేస్తున్నారు.

యష్ ఇంత సింపుల్ గా ఉండటానికి తన తండ్రి కూడా ఒక కారణం అంటూ ఉంటారు. ఎందుకంటే యష్ ఒక గొప్ప హీరో అయినా కూడా తన తండ్రి మాత్రం డ్రైవింగ్ ఆపలేదు. ఆయన ఆర్టీసీ బస్సుకు డ్రైవర్ ఉద్యోగం చేసేవారు. కొడుకు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆయన తన వృత్తిని మాత్రం ఆపలేదు. అలాంటి తండ్రికి ఇలాంటి కొడుకులే పుడతారు అంటూ యష్ తండ్రిని కూడా పొగిడేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker