News

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్, ఏం పేరు పెట్టారో తెలుసా..?

యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్‌ దంపతులు తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆదిత్య తన సోషల్ మీడియా ద్వారా చేశారు. యామీ గౌతమ్, ఆమె భర్త ఆదిత్య ధర్ తమ మొదటి బిడ్డ మగబిడ్డకు స్వాగతం పలికారు. అయితే యామీ గౌతమ్‌.. హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కాక ముందే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్‌ యాడ్‌తో దేశవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిపోయిందీ అందాల తార. ఆ తర్వాత రవిబాబు ‘నువ్విలా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

అల్లు శిరిష్ గౌరవం, నితిన్ కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. అలా విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి యామీ గౌతమ్ ఒక మంచి’శుభవార్త’ చెప్పింది. ఆమె మే 20న అక్షయ తృతీయ రోజున ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార.

ఈ పోస్ట్ ద్వారానే తన పిల్లాడి పేరును కూడా రివీల్ చేసింది . యామీ 2021లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌ను వివాహం చేసుకుంది. ఈ మూడేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా ఇప్పుడు యామీ, ఆదిత్య తమ జీవితంలోకి ఒక బిడ్డను ఆహ్వానించారు. తమ కుమారుడికి ‘వేదవిద్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారీ లవ్లీ కపుల్. వేద, విద్ అనే రెండు పదాల నుండి ఏర్పడిన సంస్కృత పేరు వేదవిద్. ఈ పేరుకు అర్థం వేదాల పరిజ్ఞానం ఉన్నవాడు అని అర్థం. విష్ణువు పేరు కూడా వస్తుంది.

‘సూర్య హాస్పిటల్‌ డాక్టర్ భూపేందర్ అవస్థి, డాక్టర్ రంజనా ధనుతోపాటు అసాధారణమైన అంకితభావం గల నిపుణులైన వైద్యబృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆస్పత్రి వైద్యుల నైపుణ్యం, అవిశ్రాంత కృషి వల్లనే మా జీవితాల్లోకి ఈ ఆనందం వచ్చింది. పవిత్రమైన అక్షయ తృతీయ నాడు వచ్చిన మా ముద్దుల కొడుకు వేదవిద్‌ని పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాం. దయచేసి అతనికి మీ ఆశీర్వాదాలు అందించండి.. ప్రేమ వర్షం కురిపించండి’ సోషల్ మీడియా వేదికగా అందరినీ కోరారు యామీ దంపతులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker