News

ప్రపంచంలోనే అత్యంత ధనిక ఫ్యామిలీని చుశారా..! వీళ్ళ ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు.

యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమద్ బిన్ జాయెద్ అల్ నహయాన్ ఈ కుటుంబ పెద్ద. ఈయనకు 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు ఉన్నారు. అలాగే.. 9 మంది సంతానం, 18 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే అతనే దుబాయ్‌కు చెందిన అల్ నహ్యాన్ రాజు. తనకు 2023 వరకు 305 బిలియన్ డాలర్ల (రూ. 25 లక్షల కోట్లు) నికర సంపద ఉన్నట్లు నివేదిక తెలిపింది.

అంతేకాదు వారి విలాసవంతమైన సౌకర్యాలలో రూ.4,078 కోట్ల భవనం, ఎనిమిది ప్రైవేట్ జెట్‌లు, ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ సహా అనేక ఉన్నాయని వెల్లడించింది. UAE అధ్యక్షుడైన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను MBZ అని కూడా పిలుస్తారు. ఇతనికి పెద్ద ఫ్యామిలీ ఉండగా..వారిలో 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు ఉన్నారు.

ఎమిరాటి రాజ కుటుంబంలో అతనికి తొమ్మిది మంది పిల్లలు, 18 మంది మనవరాళ్ళు కూడా కలరు. ఈ ఫ్యామిలీకి ప్రపంచంలోని అనేక సంస్థల్లో వాటాలు ఉండటం విశేషం. చమురు నిల్వలు, మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లో ఆరు శాతం వాటా ఉంది. అంతేకాదు గాయకుడు రిహన్న బ్యూటీ బ్రాండ్ ఫెంటీ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ X వరకు వీరికి అనేక సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి.

ఈ కుటుంబం అబుదాబిలో బంగారం వర్ణంలో ఉన్న అధ్యక్ష భవనంలో నివసిస్తుంది. UAEలో వారు కలిగి ఉన్న అనేక ప్యాలెస్‌లలో ఇది అతిపెద్దది కాగా.. దాదాపు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్యాలెస్‌లో స్ఫటికాలతో తయారు చేయబడిన షాన్డిలియర్, విలువైన చారిత్రాత్మక కళాఖండాలు అనేకం ఉన్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker