మహిళలు వయాగ్రా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? వారి కోసం ప్రత్యేకంగా..
మహిళలు తమ సెక్స్ పవర్‌ను పెంచుకునేందుకు రోజా రంగులో ఉండే వయగ్రా మాత్రలు ఉపయోగపడతాయంటున్నారు. ప్రయోగాలన్నీ ముగిసిన అనంతరం ఈ మాత్రలను మహిళలకు సిఫార్సు చేసేందుకు ఆహార, ఔషధాల నిర్వహణ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలామంది మహిళలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో తక్కువ సెక్స్ డ్రైవ్‌ను అనుభవిస్తారు. గర్భం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, ప్రసవం తదితర కారణాల వల్ల సెక్స్‌లో కాస్త వెనకపడిపోతారు. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో లైంగిక కోరిక తగ్గుతోందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
బలహీనమైన ఆరోగ్యం, వయస్సు సంబంధిత లేదా ఇతర కారణాల వల్ల చిన్న వయస్సులోనే లైంగిక కోరిక తగ్గే అవకాశం ఉంది. అయితే పురుషులు వారి సెక్స్ డ్రైవ్ పెంచడానికి, అంగస్తంభన కోసం వయాగ్రాను తీసుకుంటారు. మహిళలకు సహాయపడే వయాగ్రాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానం చాలా మందికి ఉంది. వయాగ్రాను పురుషులు తమ సెక్స్ డ్రైవ్‌ను పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే మహిళల్లో ఇది ఎలా పని చేస్తుందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పురుషులలో వయాగ్రా రక్త నాళాలను విస్తరిస్తుంది. పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఫలితంగా దృఢత్వం పెరుగుతుంది. ఇక మహిళల విషయానికి వస్తే.. తక్కువ సెక్స్ డ్రైవ్ ఉన్న మహిళలకు వయాగ్రా ఎంత మేలు చేస్తుందో కచ్చితంగా చెప్పడానికి ప్రస్తుతం పెద్దగా పరిశోధనలు లేవు. కానీ వయాగ్రా జననేంద్రియ ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుందని నిరూపించబడింది. ఇది సున్నితత్వాన్ని, భావోద్వేగాలను మెరుగుపరుస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు.
కానీ వయాగ్రా వాడే మహిళలు అదే సున్నితత్వాన్ని పొందడం చాలా కష్టమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఫ్లిపాన్సెరిన్ అనే ఔషధాన్ని ఫిమేల్ వయాగ్రా లేదా పింక్ పిల్ అని పిలుస్తారు. ఇది మహిళల్లో తక్కువ సెక్స్ డ్రైవ్ సమస్య నుంచి బయటపడేందుకు పని చేస్తుంది. మెనోపాజ్‌కు చేరుకుంటున్న మహిళల్లో తక్కువ లైంగిక ఆసక్తి/ఇంపల్సివిటీ డిజార్డర్ (FSIAD)తో సహా పరిస్థితులకు చికిత్స చేయడానికి 2015లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఔషధాన్ని ఆమోదించింది. కానీ వీటి వినియోగంపై మాత్రం అనుమానాలు ఉన్నాయి.