ఆడవాళ్లు చందనం రాసుకోవడం వల్ల కలిగే అద్భుతం తెలుసా..!
పెళ్లిళ్లలో పేరంటాలలో అతిథులను గౌరవించటానికి చందనమలదుతారు వచ్చిన వారందరికి ఆడ ,మగ అనే భేదం లేకుండా. స్త్రీలకి మెడ భాగానికి, పురుషులకి అర చేతుల వెనుక భాగానికి మంచి గంధం పూయటం ఈ నాటికీ నిలిచి ఉన్న ఆచారం. అసలు శుభ లేఖ మీద ఉండేదే “మదర్పిత చందన తాంబూలాలను స్వీకరించి” అని. అంటే నేను చేసే అతిథి మర్యాదలు స్వీకరించమని అర్థం. అయితే చందనం, గులాబీలు, ఈ రెండిటి కలియక అనేక సత్ఫలితాలను ఇస్తుంది అనడం లో ఎలాంటి సందేహము లేదు .
ఈ రెండింటిని కలిపి ముఖానికి పట్టించుకుంటే చర్మం ఎంతో తాజాగా, అందంగా, మరియు యవ్వనంగా కనిపించడమే కాకుండా, మీ ముఖం పై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోయి, మీ ముఖం మృదువుగా మారి ,ఎంతో కాతివంతంగా మెరుస్తుంది . కొన్నిగులాబీ పూల రేకులు తీసుకుని, 2 టేబుల్ స్పూన్లు నూరిన వోట్స్, కొంచెం గంధం తీసుకుని,కొంచెం నీరు కలిపి, పేస్ట్ లాగా చేసి మీ చర్మం పొడిగా ఉంది అనిపించిన ప్రదేశంలో కొంచెం నీరుతో శుభ్రం చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాల తరువాత చూసుకుంటే,
మీరు ఊహించని అందమైన, కోమలమైన,యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది.ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ గంధం, కొంచెం తేనె ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. మంచి సువాసనతో పరిమళించే ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ, మీ శరీరం అంతా పట్టించుకోవచ్చు, 20 నిమిషాల తరువాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
ఈ ఫేస్ ప్యాక్ మన చర్మంలోని మొటిమలను, మచ్చలను తొలగించి యవ్వనమైన చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది. అయితే ఈ మిశ్రమంలో పసుపుని కూడా కలిపితే చర్మంలో ఉన్న క్రిములని నాశనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ గంధం చెక్క ఉపయోగించి తీసిన గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి.అప్పుడే మంచి ఫలితం పొందుతాము.బయట దొరికే గంధంపొడి వాడకుండా ఉండడమే ఉత్తమం.