ఆడవారి ఆ సమయంలో విపరీతమైన దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు.
కొంతమంది ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు జరగవు. కానీ ఇంకొంతమంది మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో కడుపు నొప్పి, బాడీ పెయిన్స్, వికారం, వాంతులు, అలసట, చికాకు, వెన్ను నొప్పి వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే నెలసరి సమయంలో కొంతమంది మహిళలకు దుర్వాసన సవాలుగా మారుతుంది. బ్లీడింగ్ అధికంగా ఉన్నా, తక్కువగా ఉన్నా కూడా దుర్వాసన వస్తుంది. దీనివల్ల బయటికి వెళ్లడానికి చాలామంది సందేహిస్తారు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే బ్లీడింగ్ మరీ దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు గైనకాలజిస్టులు.
నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అయినా, తక్కువైనా ప్రతి ఐదు గంటలకు ఒకసారి న్యాప్‌కిన్ మార్చుకోవాలి. శానిటరీ నాప్‌కిన్ ఎక్కువసేపు వాడితే దుర్వాసన వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు వాడడం వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ దుర్వాసనకు కారణం అవుతుంది కాబట్టి కచ్చితంగా శానిటరీను ప్రతి ఐదు గంటలకు ఒకసారి మార్చుకోవడం అలవాటుగా చేసుకోండి శానిటరీ ఇప్పుడు అనేక రకాలలో దొరుకుతున్నాయి. వాటిలో కొన్ని పరిమళాలు వెదజల్లేవి కూడా ఉన్నాయి.
ఇలా పరిమళాలు వెదజల్లేవి వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ పరిమళాలు రావడం కోసం కొన్ని రకాల రసాయనాలను వాడతారు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు పెరగొచ్చు. అలాగే బ్లీడింగ్ వాసనకు ఈ శానిటరీ న్యాప్‌కిన్ పరిమళం తోడైతే అదో రకమైన వాసనగా మారిపోతుంది. దీని వల్ల బాత్రూం కి వెళ్ళిన ప్రతిసారి ఆ దుర్వాసనను పీల్చవలసి వస్తుంది. కాబట్టి సాధారణ ప్యాడ్లనే ఉపయోగించండి. పరిమళాలు వెదజల్లే ప్యాడ్ లకు దూరంగా ఉండండి. దుర్వాసన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి.
లోదుస్తులను ప్రతిరోజు ఉతికి ఎండలో ఆరబెట్టండి. ప్రతిరోజూ ఉతికిన వాటిని ధరించండి. కొంతమంది రెండు మూడు రోజులు ఒకటే లోదుస్తులను ధరిస్తారు. దీని వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చి నెలసరి సమయంలో దుర్వాసన అధికమైపోతుంది. కాబట్టి ప్రతిరోజూ వీలైతే రెండు లోదుస్తులను మార్చడం చాలా ముఖ్యం. నెలసరి సమయంలో బ్లీడింగ్ మరీ దుర్వాసన వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఈ దుర్వాసన కూడా ఒక లక్షణం అనే చెప్పాలి.
సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్. ఈ క్యాన్సర్ బారిన పడిన వారిలో అధిక రక్తస్రావం కనిపిస్తుంది. బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. అదొక రకమైన దుర్వాసన వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. బ్లీడింగ్ తీవ్ర దుర్వాసన వస్తూ, జ్వరం కూడా ఉంటే తేలికగా తీసుకోకండి. అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. కాబట్టి వెంటనే గైనకాలజిస్టును కలవాలి. వారు లక్షణాలను బట్టి మందులు సూచిస్తారు.