ఆడవాళ్లు గురక ఎందుకు పెడతారో తెలుసా..? ఈ అనారోగ్య సమస్యలకు సంకేతం కూడా..!
గురక పెట్టే వ్యక్తులు ఇతరులకు కలిగించే అసౌకర్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గురక అనేది కేవలం విసుగు మాత్రమే కాదు, అనారోగ్య సమస్యలకు సంకేతం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జలుబు, అలెర్జీలు వంటివి మీ శ్వాస ఆడే గాలి మార్గాన్ని నిరోధించడానికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక గురక అనేది లోతైన సమస్య, తీవ్రమైన అనారోగ్య పరిస్థితికి సంకేతం అంటున్నారు నిపుణులు.
గురక ఊపిరి ఆడకపోవడం, నోరు, గొంతు, శ్వాసలోపం సమస్యకు సంకేతం కావచ్చు. అయితే గురక చిన్న సమస్యే అయినా.. ఇది ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. గురకపెడుతున్నట్టు పెట్టేవాళ్లకు తెలియదు. కానీ పక్కనున్న వాళ్లకు మాత్రం చాలా డిస్టబెన్స్ గా ఉంటుంది. గురక శబ్దం వల్ల పక్కనున్న వాళ్లు అస్సలు నిద్ర రాదు. అందుకే గురక పెట్టే వారి పక్కన పడుకోరు. అయితే గురక అనేది కేవలం ఇబ్బంది మాత్రమే కాదు.. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యల లక్షణం కూడా అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలెర్జీ, జలుబు, అలెర్జీలు వంటి సమస్యలు మన వాయుమార్గాలకు అడ్డంకిని కలిగిస్తాయి.అందుకే ఈ సమస్యున్నవారికి గురక వస్తుంది. అయినప్పటికీ.. దీర్ఘకాలిక గురక పెద్ద అనారోగ్య సమస్యకు సంకేతమని నిపుణులు అంటున్నారు. గురక.. శ్వాస ఆడకపోవడం, నోరు, గొంతు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల లక్షణం కావొచ్చంటున్నారు. గర్భధారణ సమయంలో మహిళలు బాగా బరువు పెరుగుతారు.
అలాగే నాసికా కుహరంలోని రక్త నాళాలు విస్తరిస్తాయి. దీనివల్ల గురక వస్తుంది. అలాగే కండరాలు బాగా అలసిపోయినప్పుడు విశ్రాంతి చాలా చాలా అవసరం. స్వరపేటిక చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా గురక వస్తుంది. అధిక బరువు, మెడలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కూడా గురక వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ అదనపు కొవ్వు వాయుమార్గాలను అడ్డుకుంటుంది.
అలాగే గాలి ప్రవాహాన్నినిరోధిస్తుంది. దీనివల్ల గట్టిగా గురక వస్తుంది. మీ కండరాలు బాగా అలసిపోయినప్పుడు.. రిలాక్స్ కావడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటప్పుడు కూడా గురక వస్తుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా గురక వస్తుంది. దీనివల్ల గరగర, నెమ్మదిగా మాట్లాడటం, దడ వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ గురకకు దారితీస్తాయి.