కడుపుతో ఉన్న మహిళా స్కానింగ్ చూసి డాక్టర్లు షాక్, ఏం జరిగిందో మీరే చుడండి.
వైద్యరంగంలో అతిధ్వనులను శరీర అంతర్భాగాలను పరిశీలించేందుకు, రోగగ్రస్థ కణజాలం నిర్మూలించేటందుకు, చెడిపోయిన కణజాలాన్ని బాగుచేయడానికి ఉపయోగిస్తారు. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పుల నివారణలో అతిధ్వనులను ఉపయోగిస్తారు. మూత్రపిండాలలోని రాళ్ళను నిర్మూలించడానికి కూడా అతిధ్వనులను వాడుతున్నారు. అయితే చిన్న పిల్లలు అల్లరి చేయడం కామన్.
ఒకే తల్లి కవల పిల్లలు ఏదొక విషయంలో ఇంట్లో పొట్లాడుకోవడం వెరీ కామన్. నాకు అది కావాలంటూ.. నాకు ఇది కావాలంటూ మారం చేస్తుంటారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. అలుగుతుంటారు. తల్లి ఇద్దరి పిల్లలని మందలించడం… లేదంటే బుజ్జగించడం వెరీ వెరీ కామన్. పుట్టకముందే పిల్లలు పొట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? తల్లి కడుపులోనే ఇద్దరు కవలలు కొట్టేసుకున్నారు. కవలలు ఒకరిమీద ఒకరు పంచ్ విసురుకున్నారు.
మీరు చదివింది నిజమే.. కడుపులో కవలలు పొట్లాడుకోవడం ఏంటీ? అనుకుంటున్నారా? మీరే కాదు.. ఆల్ట్రా స్కానింగ్ తీసిన డాక్టర్లు కూడా అదే అనుకున్నారు. పంచ్ లు విసురుకుంటున్న కవలలను చూసి షాక్ అయ్యారు. అభిమన్యుడు తల్లి కడుపులోనే అన్ని విషయాలు నేర్చుకున్నట్టు.. ఈ ఇద్దరు కవలలు కూడా తమ తల్లి కడుపులోనే ఉండగానే.. కరాటీ, కుంపూ, మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకున్నారేమో అనిపించేలా ఉన్నారు.
తల్లి కడుపులో హాయిగా నిద్రపోతున్న కవలలు.. ఎదురెదురుగా చేతులు ముడుచుకుని ఉండటాన్ని వైద్యులు చూసి ఆశ్చర్యపోయారు. ప్రతి 30 మిలియన్ల కేసుల్లో ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు. గత డిసెంబర్ లో ఆల్ట్రా స్కానింగ్ చేసిన నర్సు ఈ దృశ్యాన్ని చూసి పెద్దగా నవ్వేసింది. ఈ కవలల్లో ఇద్దరు ఆడపిల్లలే కావడం విశేషం.
ఈ స్కానింగ్ చేసిన నాలుగు నెలల తర్వాత చైనాలోని యుంచువాన్ ఆస్పత్రిలో ఈ కవలలు ఆరోగ్యంగా జన్మించారు. ఒక ఆడశిశువు 4.3ఎల్ బీ ఉంటే.. మరో ఆడశిశువు 3.57ఎల్ బీ బరువు ఉంది. ఇద్దరూ ఒక నిమిషం వ్యవధిలో జన్మించారు. స్థానిక నివేదిక ప్రకారం.. పుట్టిన ఆడ కవలలు నెలలు నిండకముందే జన్మించగా.. దీనిపై స్పష్టత లేదు. పుట్టిన ఇద్దరి బేబీలను పేరంట్స్.. చెర్రీ, స్ట్రాబెర్రీ నిక్ నేమ్ లతో ముద్గుగా పిలుకుంటున్నారు.