మహిళల పీరియడ్ నొప్పిని సింపుల్ గా తగ్గించే చిట్కాలు, ఇవి మహిళలకు ఓ గొప్ప వరం.
మహిళలు బయలాజికల్ సమస్యలతో ఈ కాలంలో మరింత ఎక్కువగా బాధపడుతుంటారు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో మహిళలు మరింత చికాకుగా కనిపిస్తారు. ఓవైపు మండే ఎండలు మరో వైపు పీరియడ్స్ సమస్యతో వారు ఉక్కిరిబిక్కిరై పోతుంటారు. నెలసరి సమయంలో తలెత్తే పొత్తు కడుపు నొప్పి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. సాధారణంగా అందరు మహిళలు తమ జీవితంలో పీరియడ్స్ పెయిన్ ఎదుర్కొంటారు. ఇది చిన్నపాటి సమస్యేనని కొట్టిపారేయడానికి లేదు. రోజువారీ జీవితం, పనులు, ప్రొడక్టివిటీ, మొత్తం శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడం..ఒత్తిడి, మజిల్ టెన్షన్‌ను పెంచుతుంది, హార్మోన్ల సమతుల్యతకు భంగం కలిగిస్తుంది. దీంతో పీరియడ్స్ సమయంలో అసౌకర్యం మరింత పెరుగుతుంది.
డీప్ బ్రీతింగ్, ధ్యానం లేదా యోగా వంటివి స్ట్రెస్ లెవల్స్ తగ్గిస్తాయి. ఈ పద్ధతులు ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తాయి. ఇవి సహజంగా నొప్పిని దూరం చేసే హార్మోన్లు. ఇవి మూడ్ ఎలివేటర్‌లుగా పనిచేస్తాయి. హైడ్రేటెడ్‌గా ఉండటం.. పీరియడ్స్ వల్ల వచ్చే ఉబ్బరాన్ని ఎదుర్కోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండాలి. పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరం నుంచి ఎక్సెస్ ఫ్లూయిడ్స్ బయటకు పోతాయి, ఉబ్బరం తగ్గుతుంది. రోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. సాధారణ టీలకు బదులుగా హెర్బల్ టీలు తాగండి. ఓల్డ్ టెక్నిక్స్.. తరతరాలుగా పాటిస్తున్న పాత చిట్కాలు పీరియడ్స్ పెయిన్‌ను దూరం చేస్తాయి. హీటింగ్ ప్యాడ్స్ లేదా వెచ్చని టవల్స్‌ను పొత్తికడుపు కింది భాగంలో అప్లై చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి, తిమ్మిర్లు తగ్గుతాయి.
సున్నితమైన మసాజ్‌లు, ఆక్యుపంక్చర్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తూ, టెన్షన్‌ను తగ్గిస్తాయి. ఆహారంలో మార్పులు..ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాల్మన్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు ఇన్‌ఫ్లమేషన్, క్రాంప్స్ తగ్గిస్తాయి. ఆకు కూరలు, నట్స్, తృణధాన్యాలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు కండరాలను రిలాక్స్ చేసి, నొప్పిని తగ్గిస్తాయి. అధిక ఉప్పు, కెఫిన్, ఆల్కహాల్‌ను దూరం చేయడం వల్ల ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. మెడిసిన్.. మెన్‌స్ట్రువల్ క్రాంప్స్ నుంచి ఉపశమనం కోసం వైద్యుల సలహాతో పెయిన్ రిలీవింగ్ మెడిసిన్ వాడవచ్చు. మెడికల్ షాపుల్లో లభించే ఈ మందులు ప్రోస్టాగ్లాండిన్స్, గర్భాశయ సంకోచాలు, నొప్పికి కారణమయ్యే ఇతర కెమికల్స్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
పారాసెటమాల్, హైయోసిన్ కాంబినేషన్ కూడా పీరియడ్స్ డిస్‌కంఫర్ట్‌ని మేనేజ్ చేస్తుంది. ప్లాండ్ బేస్డ్ రెమిడీస్, హైయోసిన్ వంటి మందులు త్వరగా ఉపశమనాన్ని అందిస్తాయి. రోజువారీ పనులు చేసుకునేందుకు అనువుగా ఉంటాయి. చాలా మంది మహిళలు పీరియడ్స్ పెయిన్ కేవలం రుతుక్రమంలో సహజ భాగం అని నమ్ముతారు. అయితే పీరియడ్స్ మీ రోజువారీ జీవితానికి అంతరాయం కలిగించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఈ టిప్స్ పాటిస్తూ నొప్పి, ఉబ్బరం, మానసిక ఆందోళనను తగ్గించుకోవచ్చు. ప్రతి మహిళ శరీరం భిన్నంగా ఉంటుంది. అందుకే ఎక్స్‌పరిమెంట్ చేసి మీకు ఏది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందో తెలుసుకొని, దాన్ని ఫాలో అవ్వడం మంచిది.