Health

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.

దురదృష్టవశాత్తు కొందరు మహిళలకు ఆ భాగ్యం ఉండదు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది మహిళల ఆరోగ్యం. కొందరు పుట్టుకతోనే అండాశయ లోపాలతో జన్మిస్తారు. ఆ కారణంగా వారు తల్లి కాలేరు. మరి కొందరు జన్యుపరమైన లోపాల కారణంగా గర్భం దాల్చలేరు. అయితే చాలా ఎక్కువ మంది మాత్రం తమ ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం కారణంగా తమ నుదిటి రాతను తామే తుడిచేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి.

అయితే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో జీవనశైలి మార్పులు, క్రమం తప్పకుండా చెకప్‌లు మరియు ఇతర ముఖ్యమైన పనుల కీలక పాత్ర పోషిస్తాయి. శారీరక సంబంధాల్లో ఉన్నవాళ్లు, గర్భంతో ఉన్నవాళ్లు, తల్లి కావడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు, వాళ్ల శరీరం గురించి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. క్యాన్సర్లు, గర్భస్రావాలు, వివిధ గర్భాశయ వ్యాధులు రాకుండా ఉండటానికి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి అమ్మాయికీ ఉంది. ఈ అనారోగ్యం మనిషి శారీరక, మానసిక తీరుమీద ప్రభావం చూపుతుంది.

మన దేశంలో శారీరక సంబంధాల్లో ఉన్న యువతలో దాదాపు 72% మంది అసురక్షిత శృంగారంలో పాల్గొంటున్నట్టు తేలింది. నివేదికల ప్రకారం, భారతదేశంలో కనీసం 40% మంది యువత తమకు అవసరమైన గర్భనిరోధకాలను పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రపంచంలో జరిగే ప్రసూతి మరణాలలో మన దేశంలో జరిగేవి 15%. పంతొమ్మిది శాతంతో నైజీరియా మొదటి స్థానంలో ఉందంతే. స్త్రీ ఆరోగ్యం బాగుండాలంటే సరైన జీవనవిధానం, క్రమం తప్పకుండా కొన్ని చెకప్‌లు చేయించుకోవాలి.

గురుగ్రామ్‌లోని CK బిర్లా హాస్పిటల్‌లో ప్రసూతి, గైనకాలజీ డైరెక్టర్, డాక్టర్ దీపికా అగర్వాల్ HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహిళల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని మార్గాలను సూచించారు. సురక్షిత శృంగారం..అనాలోచితంగా గర్భం రాకుండా, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి కండోమ్‌లు లేదా ఇతర రకాల జనన నియంత్రణ మార్గాలను ఉపయోగించండి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు..గైనకాలజిస్టులను కలుస్తుండటం, మామోగ్రామ్, HPV పరీక్షలు, పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఏదైనా సమస్యలుంటే మొదటి దశలోనే తెలిసిపోతుంది.

ఆరోగ్యకరమైన జీవన విధానం..సమతుల్య ఆహారం తినడం, వ్యాయామం, ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం కూడా పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడతాయి. నొప్పి గుర్తించండి..నొప్పి, అసౌకర్యం, అసాధారణంగా డిశ్చార్జ్ అవ్వటం అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. మద్యపానం, ధూమపానం..ఈ రెండు అలవాట్లు చాలా హాని చేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు కారణాలవుతాయి. కుటుంబ చరిత్ర తెలుసుకోండి..ఇంతకముందు ఇంట్లో ఎవరికైనా ఏమైనా జబ్బులున్నాయో కనుక్కోండి.

వాటి గురించి ముందుగానే చెబితే డాక్టర్లు సరైన సూచనలిస్తారు. ఇవి మార్చండి..డిస్పోజబుల్ ప్యాడ్స్ కు బదులుగా పర్యావరణహిత మెన్‌స్ట్రువల్ కప్స్, వస్త్రంతో చేసే ప్యాడ్స్ వాడండి. వాతావరణానికే కాదూ, మీ ఆరోగ్యానికీ మంచిది. ఎలర్జీలు, ర్యాషెస్ వంటి సమస్య ఉంటే వెంటనే ఇవి వాడటం మొదలుపెట్టండి. బయటికి చెప్పండి..ఏదైనా సమస్య ఉంది అనిపిస్తే మొహమాట పడకుండా మీ స్నేహితులతో, మీ భర్తతో, మీకు కావాల్సిన వాళ్లతో చెప్పండి.

సలహాలు తీసుకోండి. గర్భంతో ఉన్నవాళ్లు..ఎండాకాలంలో గర్భంతో ఉన్న మహిళలు డీహైడ్రేషన్, పోషకాహారలోపం, రక్తహీనత, నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడం.. లాంటి సమస్యల్ని ఎదుర్కునే అవకాశం ఉంది. దాంతో పాటే గాలి కాలుష్యం వల్ల కూడా బిడ్డ తక్కువ బరువుండటానికి, ముందస్తు డెలివరీలకు కారణం అవుతోంది. కాబట్టి శరీరానికి చలువ చేసే ఆహారం తినడం, ఇనుము జింక్ లాంటి పోషకాలు తప్పకుండా తీసుకోవడం, డాక్టర్లను సంప్రదించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker