Health

మహిళలు బొప్పాయికాయ తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి.

బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. అయితే బొప్పాయిలో జింక్, నియాసిన్, విటమిన్ సి, కాపర్, సోడియం, ఫోలేట్, మాంగనీస్, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ప్రొటీన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి పండు పొట్టకు ఎంతో మేలు చేస్తుంది.

జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. బొప్పాయి రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక రకాల అంటు వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఒక గ్లాసు బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఖచ్చితంగా బొప్పాయి జ్యూస్‌ని మీ ఆహారంలో చేర్చుకోండి. బొప్పాయిలో పీచు (ఫైబర్) ఉంటుంది. దీని నుంచి తయారుచేసిన రసం మిమ్నల్ని చాలా కాలం పాటు సంతృప్తికరంగా ఉంచుతుంది.

మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. ఖచ్చితంగా పండిన లేదా పచ్చి బొప్పాయిని ఆహారంలో చేర్చుకోండి. తద్వారా కంటిచూపు పెరుగుతుంది. ఇందులో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండును పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలి. బొప్పాయి రసం తాగితే.. స్త్రీలలో పీరియడ్స్ వచ్చే రోజుల్లో పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయి. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ పీరియడ్స్ ప్రవాహాన్ని సరిచేస్తుంది.

అదంతేకాదు అన్ని రకాల శారీరక నొప్పులను తొలగిస్తుంది. విటమిన్ సి లేకపోతే మనలో ఒత్తిడి పెరుగుతుంది. మూడ్ స్వింగ్స్ జరుగుతాయి. అలాంటప్పుడు బొప్పాయి రసం తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. బొప్పాయి రసం ఉదరానికి చాలా ఆరోగ్యకరమైంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి పొట్ట సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker