Life Style

ఇలాంటి మహిళలకు దూరంగా ఉండాలని చాణక్య ఎందుకు చెప్పారో తెలుసా..?

చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య తక్ష శిలలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. సమాజం పట్ల, మనిషి నడవడిక పట్ల మంచి అవగాన ఉన్న వ్యక్తి. చాణుక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరించారు.

అయితే తన నీతి శాస్త్రంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎలాంటి మహిళలకు దూరంగా ఉండాలి? ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే జీవితం నందనవనంగా మారుతుందనే విషయాలపై ఆసక్తికరంగా వివరించాడు. మనం పెళ్లి చేసుకునే మహిళ బద్దకస్తురాలై ఉండకూడదు. మహిళ బద్ధకస్తురాలైతే ఆ ఇల్లు చిందరవందరగా ఉంటుంది. పిల్లలకు కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. బద్ధకంగా ఉన్న మహిళలు ఏ పని చేయకుండా ఉంటారు.

దీంతో జీవితంలో వారికి ఎలాంటి లక్ష్యాలు ఉండవు. ఎప్పుడు చూసినా ఏ పని చేయకుండా కూర్చుంటే ఇల్లు గడవటం కూడా కష్లమవుతుంది. అలాంటి వారితో స్నేహం చేసినా మిగతా వారు కూడా చెడిపోతారు. మహిళలకు బద్ధకం ఉంటే కష్టం. వారితో సంసారం చేయడం అంత సులభం కాదు. అత్యాశ కలిగిన స్త్రీలను కూడా పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే వారి ఆశలు తీర్చుకోవడానికి వారు ఎంతకైనా తెగిస్తారు. తమ స్వార్థం కోసం ఎదుటి వారిని బలి చేస్తారు.

తమ సుఖమే ప్రధానంగా ముందుకు సాగుతారు. దీంతో కట్టుకున్న వాడికి చుక్కలే. సంసారంలో ఎలాంటి అనురాగాలు ఉండవు. అత్యాశ కలిగిన వారు అబద్దాలు చెబుతారు. తమ కోరికలను తీర్చుకునేందుకు ఎందాకైనా వెళతారు. పిల్లలను సైతం పట్టించుకోరు. దీంతో భర్తకు ఇబ్బందులు తప్పవు. ఇలాంటి మహిళలను చేసుకుంటే మగవాడికి ఇక నరకయాతనే. అందుకే చాణక్యుడు చెప్పినట్లు మంచి నడవడిక గల వారిని చేసుకోవడమే ఉత్తమం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker