చలికాలంలో ఎక్కువగా ఆ పనిలో పాల్గొనాలనిపిస్తుందా..? దీనికి కారణం ఏంటో తెలిస్తే..?
చాలామంది శృంగారం అంటే శారీరక కలయికే అనుకుంటారు. కానీ దానికి ముందుచేసే ఫోర్ ప్లే కూడా శృంగారంలో భాగమే. భాగస్వాములిద్దరూ శృంగార అనుభూతులను ఆసాంతం అనుభవించాలంటే ఫోర్ ప్లే చాలా ముఖ్యం. ఫోర్ ప్లే అనేది శృంగారంలో మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆలుమగల మధ్య ప్రేమను మరింత పెంచడంలో దోహదపడుతుంది. అయితే చలికాలంలో పగలు తక్కువగానూ, రాత్రులు ఎక్కువగానూ ఉంటాయి.
దీని వల్ల మన శరీరంలో మెలటోనిన్ హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తాయి. ఇది నిద్రను పెంచుతుంది. చలి వల్ల చాలా సేపు దుప్పటి కప్పుకుని నిద్రపోతాం. అలాగే, లైంగిక కోరికకు కారణమయ్యే టెస్టోస్టెరాన్ హార్మోన్లు శీతాకాలంలో ఎక్కువ స్థాయిలో ప్రేరేపించబడతాయి. ఈ హార్మోన్ల పెరుగుదల లైంగిక కోరిక,శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, శీతాకాలంలో స్రవించే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రేమ భావాలను ప్రేరేపిస్తుంది.
ఇది దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. చలికాలంలో పురుషులు డోపమైన్‌ను, స్త్రీలు ఈస్ట్రోజెన్‌ను విడుదల చేస్తారు. కాబట్టి సాధారణ రోజుల్లో కంటే చలికాలంలోనే ఎక్కువగా శృంగారంలో పాల్గొంటారు. శీతాకాలంలో చాలా తరచుగా బయటకు వెళ్లరు. ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతారు.
ఇది జంటలు పడకగదిలో ఎక్కువ సేపు గడిపే ఆలోచనను ప్రేరేపిస్తుంది,శారీరక సాన్నిహిత్యాన్ని సృష్టిస్తుంది. మసాలా ఆహారాలు మీ రక్త ప్రసరణను, శరీర ఉప్పును పెంచుతాయి. ఇది మెదడు నరాలను ఉత్తేజపరుస్తుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్లు ఉత్తేజితమవుతాయి. దానిమ్మ పండు తింటే మన శరీరంలో రక్తప్రసరణ ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది లైంగిక కోరిక,సంతృప్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో ఇది సహజమైన మార్పు. ఈ సమయంలో మీరు ఎక్కువ రాత్రులు మీ భాగస్వామికి శారీరకంగా,మానసికంగా సన్నిహితంగా ఉండటానికి మరిన్ని అవకాశాలను పొందుతారు.