Health

ఈ జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు రావు.

శీతాకాలంలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. శీతాకాలంలోని చల్లని గాలి కారణంగా అస్తమా ఉన్న వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అస్తమా బాధితులు నిత్యం ఉదయం, సాయంత్రం, యోగా, ప్రాణాయామం చేయడం మంచిది. అయితే ఈ సీజన్ లో వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. చల్లని గాలి, పొగ మంచు కారణంగా గాలి మరింత దట్టంగా మారి కాలుష్య కారకాలను అంటుకుని ఉంటుంది.

దీనివల్ల గాలి మొత్తంగా కాలుష్య కారకాలతో నిండి ఉంటుంది. ఇటువంటి గాలిని పీల్చడం వలన శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువవుతాయి. ఉబ్బసం, జలుబు, దగ్గు, బ్రోంకైటిస్, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, హృదయ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలపు పొగమంచు శరీరంపై ప్రభావం చూపుతుంది. చలికాలంలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా, ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంచడానికి ఫ్లూ, న్యుమోనియా వ్యాక్సిన్‌ను తీసుకోవడం ఉత్తమం. పొగమంచు, వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవటం మంచిది.

మార్నింగ్ వాక్, ఇతర వ్యాయామాలను బయట కాకుండా ఇండోర్ కే పరిమితం చేయాలి. బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడం మరిచిపోవద్దు. పొగమంచు, కాలుష్యం దుష్ప్రభావాల నుండి కూడా మిమ్మల్ని రక్షించుకోవడానికి మాస్క్ తప్పనిసరి. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోండి. దుమ్ము, అలెర్జీ కారకాలు లేకుండా ఇంటిని వాక్యూమ్ క్లీన్ చేసుకోవాలి. పరుపులు, రగ్గులు, తివాచీలు ఉతకండి, ఫర్నిచర్, కిటికీ కర్టెన్లను శుభ్రపరుచుకోవాలి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ను ఏర్పాటు చేసుకోవాలి.

శరీరానికి సరిపడినంత నీరు తీసుకోవడం వల్ల వాయుమార్గాలు శుభ్రంగా , స్పష్టంగా ఉంటాయి. ఆస్తమా రోగులు, ఇన్ హేలర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. యాపిల్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, వాల్‌నట్స్, కివీ, క్యాబేజీ, బీన్స్, బెర్రీలు, బ్రోకలీ, బొప్పాయి, పైనాపిల్, క్యారెట్, పసుపు , అల్లం వంటి పదార్థాలు ఆహారంలో చేర్చుకుంటే అవి ఊపిరితిత్తులకు మంచివి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. చేతులను శుభ్రంగా ఉంచుకోండి. మురికి చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకరాదు. పొగత్రాగ వద్దు, చలికాలంలో పొగత్రాగడం వలన గొంతు అలర్జీలు, ఊపిరి సమస్యలు అధికమౌతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker