చలికాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ..! ఈ లక్షణాలు కనిపించిన వెంటనే..?
ఈ సీజన్ లో హార్ట్ ఎటాక్ రిస్క్ బాగా పెరుగుతుంది. నిజానికి చలికాలంలో మన జీవనశైలి ఎక్కువగా మారుతుంది. చలి కారణంగా చాలా మంది ఈ సీజన్ లో వ్యాయామం చేయరు. ఎక్కువగా నడవరు. అంటే శారీరక శ్రమను బాగా తగ్గించేస్తారన్న మాట. ఇదే గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. మీ ఇంట్లో ఎవరైన హార్ట్ పేషెంట్ అయితే ఈ సీజన్ లో వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే చలికాలం మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ముందే ఈ సీజన్ లో మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల లేనిపోని రోగాల బారిన పడతాం.
కాగా ఈ సీజన్ లో డయాబెటిస్, హార్ట్ పేషెంట్లు ఆరోగ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. గుండెపోటు ఒక ప్రాణాంతక సమస్య. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే బాధితులు సకాలంలో చికిత్స చేయించుకోవాలి. కానీ చాలా సార్లు గుండెపోటు లక్షణాలను చాలా మంది గుర్తించరు. దీనివల్లే ప్రాణాల మీదికి వస్తుంది. సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే..? సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే మరేదో కాదు.. గుండెపోటే. కానీ ఈ గుండెపోటు లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి.
అంటే సైలెంట్ గుండెపోటు ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించదు. కానీ ఇది గుండెపోటుతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే లక్షణాలు మాత్రం కనిపించవు. సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు..అజీర్ణం, మైకంగా అనిపించడం, నిద్ర లేమి, అస్వస్థతకు గురికావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దీర్ఘకాలిక అలసట, వెనుక లేదా ఛాతీ కండరాలలో ఒత్తిడి. సైలెంట్ గుండెపోటుకు కారణాలు.. అధిక బరువు:- అధిక బరువు మీ గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల సైలెంట్ హార్ట్ ఎటాక్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు ఊబకాయం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కు కూడా కారణమవుతుంది.
ఇవి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక రక్తపోటు:- సైలెంట్ హార్ట్ ఎటాక్ కు అధిక రక్తపోటు కూడా కారణమవుతుందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు మీ గుండె, ధమనులు, ఇతర ముఖ్యమైన అవయవాలపై ఒత్తిడిని తెస్తుంది. దీంతో సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తుంది. అధిక కొలెస్ట్రాల్:- శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పేరుకుపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా ‘చెడు’ కొలెస్ట్రాల్ ధమనుల లోపల ఫలకాన్ని ఏర్పరుస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అలాగే నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. వయసు:- సైలెంట్ గుండెపోటుకు వయస్సు కూడా ఒక ప్రధాన కారణమేనంటున్నారు నిపుణులు.
నిజానికి వయస్సుతో పాటుగా గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. ధూమపానం:- ప్రస్తుత కాలంలో చాలా మంది స్మోకింగ్ కు బానిసలవుతున్నారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిజానికి పొగాకు పొగలో ఉండే విష పదార్థాలు రక్త నాళాలను దెబ్బతీస్తాయి, ఫలకం ఏర్పడే అవకాశాలను పెంచుతాయి. దీనివల్ల సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశముంది. కుటుంబ చరిత్ర:- మీ కుటుంబంలో గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉంటే మీకు కూడా.. ఈ నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. అందుకే మీరు ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.