చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?
ఐస్ క్రీములుపిల్లలకు ఇవ్వొద్దని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో ఐస్ క్రీముల్లాంటివి తినడం వల్ల పిల్లల్లో జలుబు, దగ్గు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఐస్‌క్రీం చల్లగా ఉండటం వల్ల జలుబు, దగ్గు వస్తాయన్నది నిజం కాదు. ఐస్‌క్రీంలో ఉండే చక్కెర వల్లే అనారోగ్యం పాలవుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే మన నోటికి రుచికరంగా ఉండే ఎన్నో ఆహారాలు.. మన శరీరానికి హాని చేస్తాయనేది ఓ రూల్. అందువల్ల మనం ఏం తింటున్నామో వాటిపై దృష్టి పెట్టాలి. కిడ్నీలను ఇబ్బంది పెట్టకుండా.. త్వరగా అరిగే ఆహారం తీసుకుంటే మేలు. ఐస్‌క్రీమ్ మెత్తగా ఉంటుంది.
కిడ్నీలకు పెద్దగా శ్రమ ఉండదు. కానీ.. రుచికరమైన, చల్లని ఐస్‌క్రీమ్‌ని చలికాలంలో తినవచ్చా అనేది ప్రశ్న. తినకూడదు అని మనం జనరల్‌గా అనుకుంటాం. నోయిడాకు చెందిన డైటీషియన్ కామినీ సిన్హా ప్రకారం.. శీతాకాలంలో వీలైనంత వరకూ ఐస్‌క్రీమ్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే.. ఇది జలుబుకి కారణం అవుతుందని సిన్హా చెప్పారు. ముఖ్యంగా సైనస్, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఐస్‌క్రీమ్ చాలా హానికరం. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు, పెద్దలు ఐస్‌క్రీమ్‌కి దూరంగా ఉండాలి. అది చల్లగా ఉంటుంది కాబట్టి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఐస్‌క్రీమ్‌కి దూరంగా ఉండాలి. డైటీషియన్ కామిని ప్రకారం.. చలికాలం మన శరీరంలోని జీవక్రియ వేగం తగ్గుతుంది. శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఈ పరిస్థితిలో.. శరీరంలో అదనపు కేలరీలు పెరుగుతాయి. చలికాలంలో ఐస్‌క్రీమ్ తింటే.. త్వరగా బరువు పెరుగుతారు. ఎవరెంత చెప్పినా.. ఐస్‌క్రీమ్ మానడం మనకు ఎంతో కష్టమైన పని కదా. ఒకవేల చలికాలంలో ఐస్‌క్రీమ్ తినాలి అనిపిస్తే సాయంత్రం పూట తినండి అంటున్నారు నిపుణులు.
రాత్రివేళ ఐస్‌క్రీమ్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత గొంతునొప్పి లేదా జలుబు ఇతర లక్షణాలు ఉంటే చింతించాల్సిన పనిలేదు. అలాంటి సందర్భాలలో వేడినీరు లేదా అల్లం టీ తాగమని డైటీషియన్ కామిని సలహా ఇస్తున్నారు. అప్పుడు గొంతునొప్పి పోతుందని తెలిపారు. ఐస్‌క్రీం మినహాయించడమే కాదు.. మీ ఆహారానికి వేడి ఆహారాలను తీసుకోండి. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి అధికంగా ఉండే మామిడి, నారింజ, తేనె ఎక్కువగా తిసుకోండి. ఇవి సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడతాయి.