ఈ పనులు చేస్తే చాలు వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారు.
ఆఫీస్‌లు మొదలయ్యాక ముందే లేచి, టైమ్‌కి తిని నిధానంగా వెళ్లే వారు చాలా తక్కువ. లేట్‌గా లేచి ఆదరాబాదరాగా పరిగెత్తేవారే ఎక్కువ. అలాంటి ముందుగా చేసే పని బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం. అయితే రోజూ టిఫిన్ చేయకపోవడం బరువు పెరగడం మాత్రమే కాదు, ఊబకాయం లాంటి సమస్య కూడా వస్తుందట. హెవీగా కాకపోయినా ఎంతోకొంత బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇంటి పనులతోనే.. చేతులు, కాళ్లను బలంగా చేసేందుకు ఎన్నో రకాల ఎక్సర్ సైజ్లు చేస్తుంటారు.
వీటికి బదులుగా ఇంట్లో రకరకాల పనులు చేస్తే కూడా చేతులు బలంగా అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం జిమ్ముల్లోనే చెమటలు చిందించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డంబెల్స్ తో ఎక్సర్ సైజెస్ లు చేయాల్సిన అవసరం లేదు. చేతి కండరాలు బలంగా తయారవ్వాలంటే ఇంట్లో పనులు చేసినా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని చాలా మంది ఎన్నో రకాల ఎక్సర్ సైజెస్ ను చేస్తుంటారు. అయితే శారీరక శ్రమ చేసినా.. సులువుగా బరువు తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
నిజానికి బరువు తగ్గాలనుకునేవారు ఎటైనా వెళ్లాల్సి వస్తే బైక్ కు బదులుగా నడవడమో లేకపోతే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లడమో చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే బరువు పెరిగే ప్రసక్తే ఉండదు.. మీరు గమనించారో లేదో.. ఇంట్లో అన్ని పనులను చేసే చాలా మంది ఆడవారు అధిక బరువు ఉండరు. ఎందుకంటే వీరు వంగడం, నడవడం, వంటి ఎన్నో పనులను చేస్తుంటారు. ముఖ్యంగా వంగి పనులను చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అంతేకాదు వంగి చేసే పనుల వల్ల పొట్ట, నడుము కొవ్వులు ఫాస్ట్ గా కరిగిపోతాయి. అక్కడ కొవ్వు పేరుకుపోయే ప్రమాదమే ఉండదు.
ఇక శారీరక శ్రమతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. నోటిని ఊరించిందని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను తింటే మీ బరువును ఏం చేసినా తగ్గించుకోలేరు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రాణాలను తీస్తుంది. ఈ మధ్యనే ఇలా వ్యాయామాల మధ్యలో ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. బరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేయకుండా.. రోజూ చిన్న చిన్న వ్యాయామాలను కొద్ది సేపు మాత్రమే చేయండి. ఇది మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది.