Life Style

భర్తల నుంచి భార్యలు ఎప్పుడూ ఏం ఆశిస్తారో తెలుసుకోండి. చివరికి మాత్రం..?

పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.

విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం. అయితే పెళ్లయిన తర్వాత భార్య భర్తల బంధం మరింత బలపడాలి అంటే ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఉండాలి అయితే చాలా మంది అబ్బాయిలు మాత్రం పెళ్లి తర్వాత తమ జీవితం మొత్తం తమ భార్య కంట్రోల్ లోకి వెళ్లిపోయిందని తెగ ఫీల్ అవుతూ ఉంటారు.భార్యకు ఏం కొనిపెట్టిన చాలా అసంతృప్తిగానే ఉంటారని తనకు ఏం కావాలో మాకు తెలియడం లేదు అంటూ సమాధానాలు చెబుతుంటారు. సాధారణంగా ఒక భార్య భర్త నుంచి ఎప్పుడూ కూడా శ్రద్ధ కోరుకుంటుంది.

తన భర్త తన పట్ల కాస్త శ్రద్ధ చూపించాలి అని ఆశపడుతుంది.ఆమె పట్ల మీరు ప్రేమ ఆప్యాయత చూపించాలని కోరుకుంటుంది మీరు గోరంత ప్రేమ చూపిస్తే ఆమె మీకు తిరిగి కొండంత ప్రేమను పంచుతుంది.ఇక భార్యాభర్తల విషయంలోనే కాదు ఏ సంబంధంలోనైనా కమ్యూనికేషన్ అనేది ఎంతో ముఖ్యం మీరు ఏదైనా మాట్లాడాలనుకున్న తప్పనిసరిగా మీ భార్యతో ఆ విషయం గురించి మాట్లాడాలి.

అదేవిధంగా ఆమె చెప్పేది కూడా అంతే సహనంతో వినాలి ఇలా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది తప్పనిసరి. ఇక మీ భార్య ఎప్పుడూ కూడా మీ నుంచి మద్దతు కోరుకుంటుంది. పలు విషయాలలో మీరు తనకు మద్దతుగా నిలబడాలని ఆశపడుతుంది. ఇలా అవసరమైనప్పుడు మీరు ఆమెకు కాస్త ప్రోత్సాహాన్ని మద్దతును తెలియజేయడం అవసరం.

ఇక నమ్మకం కూడా భార్య భర్తల మధ్య ఎంతో అవసరం మీ భార్య మీ నుంచి ఎప్పుడు కూడా ఇదే నమ్మకాన్ని కోరుకుంటుంది. ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూడా నమ్మకంగా ఉండడం వల్ల ఆ బలం మరింత బలపడుతుంది.అదేవిధంగా భార్య ఎప్పుడూ మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు మీరు తన పట్ల హేళనగా మాట్లాడకుండా కాస్త గౌరవంగా మాట్లాడాలని కోరుకుంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker