భార్యలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే భర్త చెయ్యాల్సిన పని ఇదే.
పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అయితే దాంపత్య జీవితం ఎంతో అందంగా ఉంటుంది. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు విభిన్న అభిరుచులు, అలవాట్లు ఉన్న వారు వివాహం అనే బంధంతో ఒక్కటై కలిసి జీవితాంతం ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు, ఇబ్బందులు, సంతోషాలు, కష్టాలు, సుఖాలు ఉంటాయి. వీటన్నింటిని దాటుకుంటూ ముందుకు సాగిన వారే విజేతలుగా నిలుస్తున్నారు.
జీవితాంతం ఆనందంగా గడుపుతారు. భార్యబర్తలిద్దరూ ఒకేలా ఉండాలని రూల్ ఏం లేదు. ఎవరి ఆలోచనలకు విధంగా వారుంటారు. కానీ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి. ఒకరి కష్టాన్ని మరొకరు షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులను చూస్తే ఏ పనిచేయనట్లు కనిపిస్తారు. కానీ మగవారి కంటే ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో వారికి తోడుగా ఉండాల్సిందే. భార్యభర్తలిద్దరూ సమానమే. కానీ వారి పనుల్లో తేడాలుంటాయి. మగవారు బయటకు వెళ్లి విధులు నిర్వహిస్తుంటారు. ఆడవాళ్లు ఇంట్లో ఉన్నా మగవారి కంటేఎక్కువగా పనులు చేస్తుంటారు.
వారి సొంతపనులు చేసుకోవడంతో పాటు కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఒత్తిడిగా ఫీలవుతారు. ఆడవాళ్లు ఎక్కువగా స్ట్రెస్ కు ఫీలయినప్పుడు కోపంతో అరుస్తారు. కానీ కొందరు మగవాళ్లు ఇది అర్థం చేసుకోలేక వారిపై కోప్పడుతారు. దీంతో ఇద్దిరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. కరోనా సమయంలో చాలా మంది మగవాళ్లు ఇంట్లో ఉండి పనిచేశారు. ఈ సమయంలో మగవాళ్ల కంటే గృహిణులే ఎక్కవగా కష్టపడ్డారని తెలుస్తోంది. ఈ సమయంలో వారు ఒత్తిడి తట్టుకోలేక అనేక అనారోగ్యాల బారిన పడ్డారు.
అయితే కొందరు వారి ఒత్తిడిని అర్థం చేసుకోకుండా వారిపై అరుస్తారు దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. అలా కాకుండా వారి మనసును అర్థం చేసుకొని ఒత్తిడి తగ్గించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. గృహిణులు అప్పుడప్పుడు ఒత్తిడికి గురైతే పర్వాలేదు. కానీ దీర్ఘ కాలికంగా ఒత్తిడికి గురైతే మాత్రం వారు గుండె సంబంధిత వ్యాధులు ఎదుర్కొని హార్ట్ ఎటాక్ కు గురవుతారు. అయితే ఇలాంటి ఒత్తిడికి గురైనప్పుడు వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
ముఖ్యంగా మానసిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని మంచి అలవాట్లను చేసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. అందు కోసం ప్రతిరోజూ ఉదయం గ్రీన్ టీ తాగుతూ ఉండాలి. అలాగే స్ట్రెస్ కు ఫీలయినప్పుడు చిన్నచిన్న ఆటలు ఆడుతూ ఉండాలి. ఇక భర్తలు వారి ఆందోళనలు అర్థం చేసుకొని విహార యాత్రకు తీసుకెళ్తు ఉండాలి. ఏ భాగస్వామిన ఊరికే కోపం తెచ్చుకోదు. అందులో ఏదో కారణం ఉండే ఉంటుంది. అది గుర్తించి వారిని అర్థం చేసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు.