Health

ప్రతి ఆరుగురిలో ఒకరు ఆ చెప్పని సమస్యతో బాధపడుతున్నారు, WHO సంచలన ప్రకటన.

ఆధునిక జీవన విధానం వల్ల మహిళల్లో సంతానలేమి సమస్య పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణంగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడాలని, తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయాలనే కోరికతో మహిళలు సరైన వయసులో అనగా 18 నుండి 25 సంవత్సరాల వయసులో పెళ్ళి చేసుకోకపోవడం, ఫలితంగా రెండు పడవలపై కాళ్ళు పెట్టినచందంగా ఇల్లు – ఆఫీసు బాధత్యల మధ్య తీవ్రమైన మానసిక ఒత్తడికి లోవవడం వంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

పురుషులు కూడా వ్యాపారాలు, ఉద్యోగాల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవ్వడం వంటి సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, కాలుష్య వాతావరణంలో జీవించడం, సెల్ ఫోనులు అధికంగా ఉపయోగించడం వంటివి ఇతర సంతానలేమి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత సమాజంలో ప్రజల జీవనశైలి అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.

కరోనా వల్ల కాస్త చక్కబడ్డా చాలా వరకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన అలవాట్లు లేవు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరిలో అనారోగ్యకర అలవాట్ల వల్ల సంతానలేమి కూడా కలుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలని, అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ప్రాంతాల మధ్య వంధ్యత్వ సమస్యలో పెద్దగా తేడాలు లేవని, సంపన్న, మధ్యతరగతి, పేద దేశాల్లో ఇదో పెద్ద సవాలుగా మారిందని సంస్థ పేర్కొంది. ‘సంపన్న దేశాల్లో 17.8 శాతం, మధ్య తరగతి, పేద దేశాల్లో 16.5శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉంది.

సంతానలేమి సమస్య అనేది ప్రతి ప్రాంతంలోనూ ఒకేలా ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అద్నాం గేబ్రియేసస్‌ తెలిపారు. ఇంతమంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి తక్కువ వ్యయం, భద్రతతో కూడిన సంతాన సాఫల్య విధానాలను తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker