తెల్ల గుమ్మడిని ఇలా చేసి తీసుకుంటే ఎన్ని రోగాలు తగ్గిపోతాయో తెలుసా..?
గుమ్మడి కాయలు పసుపు, నారింజ, గోధుమ, తెలుపు రంగుల్లో ఉంటాయి. తెల్ల గుమ్మడి కాయల్లో విటమిన్ ఎ, విటమిన్-బి6, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను దూరం చేయడానికి సహాయపడతాయి. అయితే తెల్ల గుమ్మడికాయలో విటమిన్ A, B6, C, E, కెరోటిన్, ల్యూటిన్, జీలాంథిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫొలేట్, నియాసిన్, థియామైన్ ఉంటాయి. అందుకే ఇవి ఎంతో ఆరోగ్యకరం.
అధిక బరువు పెరగడానికీ, గుండె జబ్బులు రావడానికీ కారణం అయ్యే చెడు కొలెస్ట్రాల్‌ని తెల్ల గుమ్మడికాయలు తగ్గిస్తాయి. కారణం వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. హైబీపీ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారూ.. తెల్ల గుమ్మడికాయను వండుకొని తినడం మేలు. మనకు టెన్షన్, ఒత్తిడి తగ్గాలంటే.. L ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. దీన్ని శరీరం ఉత్పత్తి చెయ్యలేదు. కానీ తెల్ల గుమ్మడిలో ఇది ఉంటుంది.
కాబట్టి.. టెన్షన్ పడేవారు తెల్ల గుమ్మడి వాడటం మేలు. విటమిన్ A, ల్యూటెయిన్, జీలాంథిన్ అనే యాంటీఆక్సిడెంట్స్.. తెల్ల గుమ్మడికాయలో ఉంటాయి. ఇవి కళ్లను అన్ని రకాలుగా కాపాడగలవు. కాటరాక్ట్స్ సమస్యను తగ్గించగలవు. కంటి చూపు మెరుగవుతుంది. కీళ్లనొప్పులు ఉండేవారు తెల్ల గుమ్మడికాయని వండుకొని తినాలి. ఇది కీళ్ల నొప్పులను బాగా తగ్గిస్తుంది.
గుమ్మడికాయ గింజలు కూడా తినాలి. అవి కూడా బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మక్రిములు, ఇతర విష వ్యర్థాలను తెల్ల గుమ్మడికాయలు తరిమేస్తాయి. ఆస్తమా ఉన్నవారు తరచూ తెల్ల గుమ్మడి కాయను కూరల్లో వాడాలి. మంచి ఫలితం కనిపిస్తుంది. తెల్ల గుమ్మడిలో థెరప్యూటిక్ గుణాలుంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థను సరిచేస్తాయి. పొట్టలో గ్యాస్ పోతుంది. అల్సర్లు తగ్గుతాయి. అజీర్తి పోతుంది.
ప్రొస్టేట్ క్యాన్సర్‌ని తగ్గించడంలో గుమ్మడి కాయ గింజలు బాగా పనిచేస్తున్నాయి. తెల్ల గుమ్మడి, గింజల్లో ఉండే కెరోటెనాయిడ్స్, జింక్.. ప్రొస్టేట్ క్యాన్సర్‌ని అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది. ఈ రోజుల్లో అంతా కాలుష్యం. రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలా అవ్వకుండా ఉండేందుకు.. తెల్ల గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. రకరకాల పోషకాలు అంది.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రావు.