Health

వారానికి 160 నిమిషాలు వ్యాయామం చేస్తే కాన్సర్ వచ్చే ప్రమాదం లేదు.

వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. అయితే వైద్యులు ఏం చెబుతున్నారంటే… ఇంట్లో ఎంత పని చేసినా నడక లేదా వ్యాయామం చేయడమే మంచిదంటున్నారు.

అందుకే కుదిరితే కనీసం రోజుకి 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మహిళలు పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉండొచ్చట. మహిళలకే కాదు ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడంతో పాటు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన 23 శాతం మలద్వార క్యాన్సర్లను నివారించుకోవచ్చని గుర్తించారు పరిశోధకులు.

వారానికి 150 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ సమయం వ్యాయామం చేసే స్త్రీలకు గర్భాశయం వాల్స్‌లో తలెత్తే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పును 34శాతం తగ్గించవచ్చట. కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారినపడి చనిపోయి ఉంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా రొమ్ము క్యాన్సర్ గల మహిళలు 20 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదు సార్లు వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు పావు వంతు తగ్గుతుంది. ప్రతి రోజై ఒక మాదిరి వ్యాయామం చేసినా కూడా జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవచ్చు.

ఆటలాడటం లేదా వినోదంతో కూడిన వ్యాయామాలు చేసే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని ఛారిటీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్… ప్రాథమిక దశలో క్యాన్సర్‌తో బాధపడుతున్న 50 మందిని ఎంపిక చేసి వారితో వారానికి రెండున్నర గంటల చొప్పున 12 నెలలపాటు వ్యాయామం చేయించింది. వారిలో గణనీయంగా క్యాన్సర్ తగ్గిపోయింది. వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెస్ట్, అండాశయం, సర్వికల్ క్యాన్సర్లను సులభంగానే ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker