పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి, అబ్బాయి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా..?
వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.
అయితే ఏజ్ గ్యాప్ ఎంత ఉంది.. అనే విషయాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. వివాహాన్ని నిర్ణయించేటప్పుడు ఈ అంశాన్ని ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య నిర్ణీత వయస్సు అంతరం ఉండటం చాలా ముఖ్యమని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. అలా జరగకపోతే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎక్కువ అవుతాయని.. అవి జీవితాంతం వెంటాడుతాయని పెద్దలు పేర్కొంటుంటారు. అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలి.. పురాతన సంప్రదాయం ప్రకారం.. అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని చెబుతారు.
అయితే ఇద్దరి మధ్య వయసు తేడా ఎంత ఉంటుందో ఎవరూ చెప్పలేదు. అబ్బాయి-అమ్మాయి వయస్సు మధ్య తేడా ఎలా ఉండాలి.. పరిశోధకులు చెప్పిన ఆసక్తికర విషయాలేంటో లుక్కెయండి. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వ్యత్యాసం.. సాధారణంగా భార్యాభర్తల మధ్య 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు అంతరం ఉండాలి. దీనిపై చాలా పరిశోధనలు కూడా జరిగాయి. వివిధ వయసుల అబ్బాయిలు, అమ్మాయిల ఆలోచనల్లో చాలా తేడా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ వ్యక్తులు కూడా ఒకరికొకరు చాలా శ్రద్ధ వహిస్తారు. ఒకరి విషయాలను మరొకరు ఎలా చూసుకోవాలో వారికి బాగా తెలుస్తుంది.
అధ్యయనంలో ఆసక్తికర విషయాలు.. దంపతుల మధ్య 1 సంవత్సరం వయస్సు అంతరం ఉంటే, వారి మధ్య విడాకులు తీసుకునే అవకాశం 3 శాతం ఉంటుందని కూడా ఒక అధ్యయనంలో ప్రస్తావనకు వచ్చింది. 5 సంవత్సరాల వయస్సు అంతరం ఉన్న జంటలు విడాకులు తీసుకునే అవకాశం 18%, 10 సంవత్సరాల వయస్సు గ్యాప్ కోసం 39%, 20 సంవత్సరాల వయస్సు గ్యాప్ ఉన్న వారు 95% ఉంటుందని అధ్యయనం పేర్కొంది. దూరం ఎంత తక్కువగా ఉంటే అంత సమన్వయం.భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం.. ఎంత తక్కువగా ఉంటే.. అంత సమన్వయం బాగుంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ఇద్దరి మధ్య సమన్వయం కూడా అంతే మంచిగా ఉంటుందని.. వీరి మధ్య విడాకుల అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొంది. శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే.. భార్యాభర్తల మధ్య సంబంధంలో భర్త వయస్సు ఎక్కువగా ఉండటం చాలా అవసరం.. ఎందుకంటే అబ్బాయి పరిపక్వత పొందుతాడు.. అప్పుడే అతను అమ్మాయికి సంబంధించిన అన్ని బాధ్యతలను అర్థం చేసుకోగలడని అధ్యయనం తెలిపింది.