డ్రై ఫ్రూట్స్ ని ఇలా ఎప్పుడూ తినొద్దు. ఎంత ప్రమాదమంటే..?
డ్రై ఫ్రూట్స్‌లో ఉండే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అల్పాహారంగానూ వీటిని తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో శరీర వేడిని కాపాడేందుకు ఇవి తోడ్పడతాయి. అయితే జీడిపప్పు, పిస్తా వంటి వాటిని నానబెట్టకుండా తీసుకోవచ్చు. కానీ బాదం, వాల్ నట్స్, కిస్ మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందాలంటే మాత్రం అవి నానబెట్టుకుని తినాలి. బాదంపప్పు.. విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలతో నిండిన బాదం ప్రపంచంలోని అత్యుత్తమ డ్రై ఫ్రూట్స్ లో ఒకటి. చాలా మంది వాటిని పచ్చిగా లేదా కాల్చుకుని తింటారు.
బదమ చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. బాదం పప్పు నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే వాటిని నాయబెట్టి పొత్తు తీసుకుని తినాలి. కనీసం 6-8 గంటల పాటు శుభ్రమైన నీటిలో నానబెట్టాలి. అప్పుడు వాటిని తింటే మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. వాల్ నట్స్..దగ్గు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే వాల్ నట్స్ తింటే చాలా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
వాల్ నట్స్ రోజువారీ డైట్ లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వీటిని పాలు లేదా నీటిలో నానబెట్టుకుని తినడం ఉత్తమమైన మార్గం. ఒత్తిడిని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. కిస్ మిస్ లేదా ఎండు ద్రాక్ష..నానబెట్టిన ఎండుద్రాక్ష మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత తీసుకునే మంచి ఫలితం ఉంటుంది. పేగులను శుభ్రం చేస్తుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల కొన్ని ఆహారపదార్థాల వల్ల వచ్చే ఆమ్లాలు తగ్గించడంలో సహాయపడుతుంది. అంజీరా..అంజీరా లేదా అంజూరా పండ్లు రుచికరమైన డ్రై ఫ్రూట్స్. ఫైబర్ అధిక మొత్తంలో ఉండటం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది.
కొలెస్ట్రాల్, పిండి పదార్థాలు ఇందులో సమతుల్యంగా ఉంటాయి. అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్లో ఇది ఒకటి. మధుమేహం ఉన్న రోగులు వీటిని రాత్రి పూట నానబెట్టుకుని ఉదయాన్నే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పీసీఓడి సమస్యతో బాధపడే వారికి ఇది మంచిది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎండు ఖర్జూరం..పోషకాల పవర్ హౌస్, ఖనిజాలు, విటమిన్స్ ఎండు ఖర్జూరంలో పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరంలో పొటాషియం ఉంటుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఖర్జూరాల్లో ఉండే ఆర్గానిక్ సల్ఫర్ సీజనల్ అలర్జీలను నివారించడంలో సహాయపడుతుంది. వీటిని నానబెట్టుకుని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాదులని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు వెల్లడించారు. గర్భిణీలకు కూడా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అందుకే రక్తహీనతతో బాధపడే వాళ్ళని ఎండు ఖర్జూరం నానబెట్టుకుని తినమని వైద్యులు సూచిస్తారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నానబెట్టిన ఖర్జూరాలు ఉత్తమ హ్యాంగోవర్ ఆహారంగా పనిచేస్తాయి.