Health

Warts: పైసా ఖర్చు లేకుండా.. నొప్పి లేకుండా.. పులిపిర్లను తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఇవే.

Warts: పైసా ఖర్చు లేకుండా.. నొప్పి లేకుండా.. పులిపిర్లను తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఇవే.

Warts: చేతులు, కాళ్లపై ఉంటే ఎవరూ పట్టించుకోరు కానీ ముఖంపై వస్తే మాత్రం వాటిని అలా గిల్లుతూ ఉంటారు, వాటిని ఎలాగైనా తొలగించుకోవాలనుకుంటారు. ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే పులిపిర్లు వచ్చేది కూడా వైరస్ వల్లే. ఆ వైరస్ వల్ల వచ్చే ఒక చర్మ ఇన్ఫెక్షన్ పులిపిర్లు. అయితే వీటితో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ చూసేందుకు మాత్రం బాగోవు. కొంత మందికి ఎక్కడో ఒకటి వస్తుంది. మరికొంత మందికి మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ముఖ అందాన్ని పాడు చేస్తాయి. పులిపిర్లు అనేవి కొల్లాజెన్, రక్తనాళాలు కలవడం వల్ల ఏర్పడతాయి.

Also Read: పళ్లు ఊడిపోయిన వారికీ గుండెపోటు వస్తుందా..?

వీటిని తగ్గించుకోవడం కోసం ఆస్పత్రికి వెళ్తే శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. కానీ ఇంటి వద్దనే.. ఇంట్లో ఉన్న వాటితోనే డబ్బు ఖర్చు పెట్టకుండా పులిపిర్లను తొలగించుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఈ వెనిగర్ మంచి క్లీనర్‌గా పని చేస్తుంది. ఇప్పుడు పులిపిర్ల సమస్యను కూడా వదిలించుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ ను తరచుగా పులిపిర్లు ఉన్న చోట రాస్తూ ఉండండి. ఇలా కొద్ది రోజుల్లోనే ఇవి మాయం అవుతాయి.

వెల్లుల్లి పాయతో కూడా పులిపిర్ల సమస్యను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి పొట్టు తీసి రసం తీయండి. ఆ రసాన్ని పులిపిర్లు ఉన్న చోట రుద్దండి. ఇలా కొద్ది రోజులు చేస్తూ ఉంటే.. పులిపిర్లు అనేవి తగ్గుతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. బంగాళదుంప ఆరోగ్యం, అందం పెంచడంలో ఎంతో చక్కగా యూజ్ అవుతుంది. ఇలాగే పులిపిర్లను కూడా తగ్గించుకోవచ్చు. బంగాళదుంప రసాన్ని పులిపిర్లు ఉన్న చోట ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రాస్తూ ఉండండి.

Also Read: మందుల్లేకుండా గ్యాస్ సమస్య తగ్గటానికి అమ్మమ్మ చెప్పిన మంచి చిట్కాలు.

కేవలం వారం రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఉల్లిపాయతో కూడా పులిపిర్లను వదిలించుకోవచ్చు. ఒక గిన్నెలోకి ఉల్లి రసం, వెల్లుల్లి రసం తీసుకుని బాగా కలపండి. ఈ రసాన్ని పులిపిర్లు ఉన్న చోట ప్రతి రోజూ రాస్తూ ఉండండి. ఇలా కొన్ని రోజులకు పులిపిర్లు అనేవి రాలిపోతాయి. పులిపిర్లను తగ్గించడంలో ఈ చిట్కాలు ఎంతో అద్భుతంగా పని చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నవాటితో ఈ సమస్య వదిలించుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker