ఉదయాన్నే ఓట్స్ తినడం అలవాటు చేసుకోండి, ప్రాణాంతక వ్యాధులను కూడా..?
ఇటీవల కాలంలో మంచి పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం కోసం చాలా మంది ఓట్స్ ను ఎంచుకుంటున్నారు. ఓట్స్ ని బ్రేక్ పాస్ట్ గా తీసుకునే వారు పాలల్లో కలిపి తీసుకోవడం ఎక్కువ చూస్తుంటాం. విటమిన్లు, పోషక ఆహార పదార్థాలు ఎక్కువుగా ఉండటంతో ఓట్స్ పై మక్కువ చూపిస్తున్నారు. కాని రోజూ పాలల్లో కలిపి తాగడం వల్ల చాలా మందికి దానిపై ఇష్టం తగ్గుతుంది. అయితే ఓట్ మీల్ ను అన్ని వయసుల వారు తినొచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అలాగే కాల్షియం, ప్రోటీన్, ఐరన్, జింక్, థయామిన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ లో మన ఎముకలను బలంగా ఉంచే విటమిన్ బి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. గుండె ఆరోగ్యం.. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఓట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. బ్లడ్ షుగర్.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఓట్స్ ఎంతో సహాయపడుతుంది.
ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లు ఓట్స్ ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. మలబద్దకం.. ఓట్స్ లో పుష్కలంగా ఉంటే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా మలబద్దకం సమస్యను కూడా పోగొడుతుంది. ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. క్యాన్సర్ల ముప్పు.. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఓట్స్ ను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది.
అందుకే ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తినడానికి ప్రయత్నించండి. అధిక రక్తపోటు.. ఓట్స్ లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే హై బీపీ పేషెంట్లు ఓట్స్ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వెయిట్ లాస్.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే తొందరగా కడుపు నిండుతుంది. దీంతో మీరు అతిగా తినే అవకాశం ఉండదు. అలాగే ఓట్స్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
అందుకే బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తింటే మీరు ఫాస్ట్ గా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. చర్మ ఆరోగ్యం..ఓట్స్ లో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎన్నో చర్మ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఓట్ మీల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై ముడతలను, నల్ల మచ్చలను, నల్ల రంగును పోగొట్టడానికి సహాయపడతాయి. ఓట్స్ లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.