Health

మ‌న శ‌రీరంలో ఏ విట‌మిన్ లోపిస్తే ఏ రోగం వస్తుందో తెలుసుకోండి.

ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులతో పోరాడటానికి, మన శరీరానికి వివిధ విటమిన్లు, ఖనిజాలు అవసరం. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ, మన శరీరంలో కొన్నిసార్లు పోషకాలు లేవు. శరీరం వివిధ రకాల వ్యాధులతో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. మరి వ్యాధి నిరోధకశక్తి పెంపొందించాలంటే కచ్చితంగా పోషక పదార్ధాలు, విటమిన్స్, ఖనిజాలు అత్యవసరం. శరీరంలో ఇవి లోపిస్తే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. అయితే విట‌మిన్ కె మ‌న శ‌రీరంలో ర‌క్తం గ‌డ్డ క‌ట్టేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌నకు గాయాలైన‌ప్పుడు ర‌క్తం ఎక్కువ‌గా పోకుండా ఉండేందుకు గాను గాయంపై ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుంది క‌దా.. అందుకు గాను విటమిన్ కె మ‌న‌కు కావాలి. అలాగే ఎముక‌లు దృఢంగా ఉండ‌డానికి, ఎముక‌లు నిర్మాణ‌మ‌య్యేందుకు, గుండె జ‌బ్బులు రాకుండా ఉండేందుకు.. మ‌నం విట‌మిన్ కె ఉన్న ప‌దార్థాల‌ను నిత్యం తీసుకోవాలి.

ఇక విట‌మిన్ కె మ‌న‌కు పాల‌కూర‌, వాల్‌న‌ట్స్‌, బ్రొకొలి, అవ‌కాడోలు, బాదంప‌ప్పు, బ్రెజిల్ న‌ట్స్‌, ఎర్ర ప‌ప్పు, యాప్రికాట్స్.. త‌దిత‌ర ఆహార ప‌దార్థాల్లో ల‌భిస్తుంది. అయితే విటమిన్ కె ఉన్న ఆహారాల‌ను మ‌నం నిత్యం తీసుకోక‌పోతే మ‌న శ‌రీరంలో ఆ విట‌మిన్ లోపం ఏర్ప‌డుతుంది. దీంతో మ‌న‌కు మ‌న శ‌రీరంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

అవేమిటంటే… విట‌మిన్ కె లోపిస్తే మ‌న చ‌ర్మం ఊరికే కందిపోయిన‌ట్లు, న‌ల్ల‌గా మారుతుంది. అలాగే చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, చిన్న గాయం అయినా బాగా ర‌క్త‌స్రావం అవడం, ర‌క్తం బాగా పోవ‌డం, స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో తీవ్ర ర‌క్త స్రావం అవ‌డం, మూత్రం లేదా మ‌లంలో ర‌క్తం ప‌డ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలోనైనా ఉంటే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి. వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుని ఒక వేళ విట‌మిన్ కె లోప‌మ‌ని తేలితే అందుకు త‌గిన విధంగా డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందులు వాడుకోవాలి. అలాగే పైన చెప్పిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం ద్వారా విట‌మిన్ కె లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker