మందు షాప్ దగ్గర తాగుబోతును తరిమికొట్టిన విశాల్, వైరల్ అవుతున్న వీడియో.
నటుడు విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోని బ్లాక్ బస్టర్ హిట్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. నటుడు విశాల్ కెరీర్‌లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా మార్క్ ఆంటోని రికార్డు సృష్టించింది. అయితే గతంలో వీరిద్దరు కలిసి చేసిన తామిరభరణి(తెలుగులో భరణి), పూజై(తెలుగులో పూజ) సినిమాలు హిట్ అయ్యాయి.
అయితే ఇప్పుడు రత్నం సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు వీరిద్దరూ జతకట్టారు. రత్నం సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే రత్నం సినిమా సెట్స్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రత్నం కోసం టాస్మాక్ షాప్(మందుబాబుల కోసం తమిళనాడు ప్రభుత్వం నడిపే లిక్కర్ షాప్) లాంటి సెట్ వేశారు.
ఇది నిజమైన టాస్మాక్ అని భావించి క్యూల వద్ద మద్యం కొనుగోలు చేసేందుకు అక్కడి వారు బారులు తీరుతున్నారు. ఇది చూసిన నటుడు విశాల్.. మద్యం కొనుక్కోవడానికి అక్కడే నిలబడిన వారిని వెళ్లిపొమ్మని కోరారు. అయితే ఓ తాగుబోతు ఇంతకీ వినకపోవడంతో అతన్ని పట్టుకుని, ఇది రత్నం సినిమా కోసం ఏర్పాటు చేశానని చెప్పి కొట్టాడని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ విడుదలై వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమా లేక సినిమా షూట్ లో భాగమా అనేది కూడా తెలియాల్సి ఉంది.