రోడ్డు దాటే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇదే. ఆ చిన్న తప్పు వల్లే..!
ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్‌కుమార్ యాదవ్(18) గుంటూరు జిల్లాకు చెందిన స్నేహితుడు పూసులూరి త్రినాథ్(18)తో కలిసి ద్విచక్ర వాహనంపై పిడిచెడ్ రోడ్డులో శివాజీ విగ్రహం నుంచి గజ్వేల్ వివేకానంద చౌరస్తా వైపునకు వస్తున్నారు. త్రినాథ్ ద్విచక్ర వాహనాన్ని నడుపుతుండగా.. శ్రావణ్‌కుమార్ వెనక కూర్చున్నాడు. అయితే అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది.
ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్‌కుమార్ యాదవ్(18) గుంటూరు జిల్లాకు చెందిన స్నేహితుడు పూసులూరి త్రినాథ్(18)తో కలిసి ద్విచక్ర వాహనంపై పిడిచెడ్ రోడ్డులో శివాజీ విగ్రహం నుంచి గజ్వేల్ వివేకానంద చౌరస్తా వైపునకు వస్తున్నారు. త్రినాథ్ ద్విచక్ర వాహనాన్ని నడుపుతుండగా.. శ్రావణ్‌కుమార్ వెనక కూర్చున్నాడు. ఆ సమయంలోనే రోడ్డు దాటుతున్న పాదచారి తొగుటకు చెందిన కనకయ్యను త్రినాథ్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కనకయ్యకు, త్రినాథ్‌కు స్వల్పగాయాలయ్యాయి.
వెనక కూర్చున్న శ్రావణ్‌కుమార్ ఎగిరి డివైడర్‌పై పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శ్రావణ్‌కుమార్ తండ్రి గట్టు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గజ్వేల్ ఇన్స్పెక్టర్ బి.సైదా తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్.. అతివేగానికి యువకుడు బలి
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2024
గజ్వేల్ – ప్రజ్ఞపూర్కు చెందిన శ్రావణ్(18) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టారు.
ఈ ప్రమాదంలో బైక్ వెనకాల కూర్చున్న శ్రావణ్ ఎగిరి డివైడర్‌పై పడడంతో తలకు బలమైన గాయాలై,… pic.twitter.com/j7P7PNifE6