ఈ కాలంలో వైరల్ ఫీవర్ రవొద్దంటే ఈ చిన్న పని చేస్తే చాలు.
తుఫాన్ల ప్రభావంతో కొన్నిసార్లు మబ్బుపట్టి, ఈదర గాలులు వీస్తుండడం వల్ల వృద్ధులు, చిన్నారులపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వెంటాడుతున్నాయి. వివిధ దేశాల్లో కోవిడ్ సంక్రమణ విజృంభిస్తుండడంతో ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చినా భయాందోళన నెలకొంటోంది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలే.. నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.
మరో నాలుగు రోజుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే పడిన వర్షాలకు అంటువ్యాధులు వస్తున్నాయి. జలుబు, జ్వరంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పుడొచ్చే వాటిల్లో వైరల్ ఫీవర్ ప్రధానమైనది. వైరల్ ఫీవర్ వచ్చినవారు ఏ ఆహారం తీసుకోవాలి.
వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అందుకు కొన్ని ఆహార పదార్థాలను డైట్ లో తీసుకోవాలి. జ్వరం ఉన్నప్పుడు మజ్జిగ అన్నం, బ్రెడ్ తినాలని చెబుతుంటారు కానీ.. వాటి వల్ల నీరసం తగ్గదు. వైరల్ ఫీవర్ ఉన్నవారు ఎక్కువగా వెజిటబుల్ జ్యూస్ లు తాగాలి.
వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వాటిలోనే అల్లం, వెల్లుల్లి కూడా కలుపుకుని తీసుకుంటే.. నాలుకకు మంచి రుచిని ఇవ్వడంతో పాటు వికారాన్ని తగ్గిస్తాయి. చికెన్ సూప్.. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు చికెన్ సూప్ తాగడం వల్ల శరీరానికి లవణాలతో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. తక్షణ శక్తిని పొందేందుకు అరటిపండ్లను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.
బ్రోకలి, కివీ పండ్లను తినాలి. వీటిలో విటమిన్ సి, ఈ, కాల్షియం, ఫైబర్లు అధికంగా ఉంటాయి. బలహీనంగా ఉన్న శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే వీలైనంత వరకూ కాచి, చల్లార్చిన నీటినే తరచూ తాగుతూ ఉండాలి.