News

విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్‌ పై సంచలన విషయం చెప్పిన వేణు స్వామి.

వీరిద్దరూ కలిసి గీతగోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా తెరవెనక కూడా వీరిద్దరూ ఎంతో చనువుగా ఉంటూ తరచు హాలిడే వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు పట్టుకొచ్చాయి. అయితే సినీ నటులన్నాక ప్రేమ వ్యవహారాలు, డేటింగ్, డివోర్స్, బ్రేకప్స్.. ఇవన్నీ కూడా కామన్. ఈ మధ్యకాలంలో అయితే సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి ఎన్నో మ్యాటర్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న సీక్రెట్ రిలేషన్‌ నడుస్తోందని ఎన్నో రకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. గీతాగోవిందం సినిమాతో వీళ్ళ మధ్య మంచి బాండింగ్ నెలకొనడంతో ఇద్దరూ కూడా తరచుగా కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీలు కుదిరిన ప్రతిసారి టూర్స్ వేస్తూ సరదాగా గడిపేస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న సీక్రెట్ రిలేషన్‌ పై అనుమానాలు ముదిరాయి. మరోవైపు ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నపై బోలెడన్ని కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయి.

రష్మిక మీద కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ వేసిందనే వార్తలు రావడం, రిషభ్ శెట్టి, కాంతారా వివాదంలో రష్మిక ఇరుక్కోవడం ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే దీనంతటికీ కారణం విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ పెట్టుకోవడమే అంటున్నారు సెలబ్రిటీల జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.

విజయ్ జాతక ప్రభావం ఇప్పుడు రష్మికపై పడుతోంది అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇరువురి జాతకాల రీత్యా విజయ్ రష్మికలు కలిసి ఉంటే ఇలానే ఉంటుందని వేణు స్వామి అంటున్నారు. రష్మికకు బ్యాడ్ టైమ్ రావడానికి కారణం విజయ్ దేవరకొండతో రిలేషన్ పెట్టుకోవడమే అన్నట్లుగా గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

ఇదే వీడియోలో రష్మిక మందన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా వేణు స్వామి రియాక్ట్ అయ్యారు. త్వరలోనే రష్మిక రాజకీయాల్లోకి రానుందని, కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రష్మిక ఎంపీగా పోటీ చేస్తుందని చెప్పారు. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ పట్టేసిన రష్మిక మందన్న.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నాలు చేస్తోంది. నేషనల్ క్రష్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని పలు బాలీవుడ్ సినిమాల్లో భాగమవుతోంది రష్మిక.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker