ఆ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా..? మీ లైంగిక జీవితం పై ప్రభావం తప్పదు.
పోర్న్ వీడియోలను చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పబ్మెడ్ ప్రకారం..18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళల్లో 75 శాతం మంది పోర్న్ చూడటానికి ఇష్టపడతారు. దీనివల్ల వీటి పట్ల వ్యసనం పెరగడం ప్రారంభమవుతుంది. అయితే ఈ రోజుల్లో ఎక్కువమంది పురుషులను వేధిస్తున్న సెక్స్ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాల్లో ఒకటి చిన్న వయసులోనే పోర్న్ వీడియోస్ చూడడం అలవాటు చేసుకోవడమే.
పోర్న్ వీడియోస్ చూడడం మొదట సరదాగానే మొదలవుతుంది తర్వాత అది వ్యసనంగా మారి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు పెళ్లయిన తర్వాత మీ దాంపత్య జీవితాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. పోర్న్ చాలా దేశాల్లో బ్యాన్ చేసినప్పటికీ కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడంతో ఫలితం శూన్యంగా మారింది.పోర్న్ చిత్రాలు అధికంగా వీక్షించడం వల్ల లైంగిక ఆరోగ్యం దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిరంతరం అల్లీల చిత్రాలు చూసే అలవాటు ఉన్నవారు నిత్యజీవితంలో మానసిక పరివర్తన సరిగా లేకపోవడంతో తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తారు ఓ అధ్యయనం ప్రకారం ఎక్కువగా పోర్న్ వీడియోస్ చూసే 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులలో అంగస్తంభన, ఆలస్యమైన స్ఖలనం, లైంగిక సంతృప్తి తగ్గడం, లిబిడో క్షీణించడం, లైంగిపరమైన నిరుత్సాహం వంటి లైంగిక పరమైన సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయని తెలిసింది.
లైంగిక సంబంధాలు ఎలా ఉండాలనే దానిపై పోర్న్ తప్పుడు అంచనాలను సెట్ చేస్తుంది. ఇది తరచుగా వ్యక్తుల్లో నిరుత్సాహానికి, తక్కువ ఆత్మగౌరవానికి దారితీస్తుంది. చిన్న వయసులోనే పోర్న్ వీడియోస్ చూసే అలవాటు ఉన్నవారు హస్త ప్రయోగం అలవాటుకు బానిసై స్వయంతృప్తిని పొందడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఫలితంగాభాగస్వామి పట్ల లైంగిక ఆకర్షణ తగ్గడం, భాగస్వామితో సెక్స్ అంచనాలను అందుకోకపోవడం,లైంగిక అసమర్థత పెరిగి భాగస్వామితో లైంగిక సంబంధానికి దూరమైపోతారు. ఫలితంగా మీ దాంపత్య జీవనం నరకప్రాయం అవుతుంది. హస్త ప్రయోగం అలవాటు మంచిదే అదే వ్యసనమైతే తీవ్ర నష్టం తప్పదు. పోర్న్ వీడియోస్ లో చూసేదంతా నిజం అనుకొని వాస్తవిక సుఖానికి దూరమై తీవ్ర మనోవేదనను అనుభవిస్తారు.