వెంకటేష్ భార్య గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు.
చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా దక్కించుకున్నారు. ఇక పద్మశ్రీ పురస్కారాలను కూడా అందుకున్నారు దగ్గుబాటి రామానాయుడు. దగ్గుబాటి రామానాయుడు కు వెంకటేష్, సురేష్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి. వీరిది చిత్తూరు జిల్లా మదనపల్లె. తల్లిదండ్రులు గంగవరపు వెంకట సుబ్బారెడ్డి, ఉషారాణి.
వీరిది పెద్ద జమీందారి కుటుంబం. వందలాది ఎకరాల భూమితో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా వున్నాయి. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా వెంకటేష్ నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనకు పెళ్లి చేయాలని రామానాయుడు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే మంచి సంబంధం ఉంటే చెప్పాలని విజయ అధినేత నాగిరెడ్డికి చెప్పారట. దీంతో నీరజారెడ్డి కుటుంబం గురించి నాగిరెడ్డి .. రామానాయుడికి చెప్పారట. నాగిరెడ్డి సూచన మేరకు ముందుగా రామానాయుడు మదనపల్లి వెళ్లి తొలుత నీరజారెడ్డిని చూసి వచ్చారు.
ఆయనకు వారి కుటుంబం, అమ్మాయి కూడా బాగా నచ్చడంతో వెంకటేష్ ను పిలిపించి చూపించారు. ఇద్దరికి ఒకరినొకరు నచ్చడంతో 1989లో వెంకటేష్ , నీరజారెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నిజానికి వెంకటేష్ ది కులాంతర వివాహం కాదు. నీరజ పేరు చివర రెడ్డి అని వున్నప్పటికీ ఆమెది రెడ్డి సామాజిక వర్గం కాదు. వాళ్లది కమ్మ సామాజిక వర్గమే. రాయలసీమలోని మదనపల్లె పరిసర ప్రాంతంలోని ప్రజలు ఏ కులానికి చెందిన వారైనా సరే పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం సర్వసాధారణమట.
ఆ ఊరి కొండపై ‘రెడ్డమ్మ’ అనే దేవత కొలువై ఉండటం తో అక్కడి వారంతా పేరు చివరన రెడ్డి అని తగిలించుకుంటారట. నీరజారెడ్డి అమ్మమ్మ గారిది కృష్ణా జిల్లా కైకలూరు దగ్గర ఉన్న వరహా పట్నం. వీరిది కూడా సంపన్న కుటుంబమే. చదువుకున్న రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి గడిపేదట. నీరజారెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మదనపల్లిలోని సీఎస్ఐ గర్ల్ స్కూల్ లో జరిగింది. అక్కడ పదవ తరగతి వరకు చదువుకున్న ఆమె.. అనంతరం మదనపల్లిలోని వీటీ కాలేజీలో చదువుకున్నారు. ఆపై ఎంబీఏ పూర్తి చేశారు.