అలెర్ట్, వాహనానికి లోన్ కట్టకపోతే బలవంతంగా లాక్కెళ్లడానికి వీల్లేదు.
చాలా మంది ఇప్పుడు బయట అప్పులు తీసుకోవటం మానేశారు. అప్పు కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు. బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు నేడు రుణాన్ని అందిస్తున్నాయి. అంతేకాదు.. మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక, తీసుకున్న మొత్తం చెల్లించడానికి ఇన్‌స్టాల్‌మెంట్ పద్దతులు ఉండనే ఉన్నాయి.
అప్పు తీసుకున్న వారు ఇన్‌స్టాల్‌మెంట్ పద్దతుల్లో బ్యాంక్ లోన్‌ను కొంచెం కొంచెంగా తీరుస్తూ ఉన్నారు. అయితే చాలామంది తమ అవసరాల కోసం లోన్లు తీసుకొని వాహనాలు కొనుక్కుంటారు. కానీ కొన్నిసార్లు డబ్బులు కట్టలేకపోవడంతో రికవరీ ఏజేంట్ల వచ్చి డబ్బులు కట్టాలంటూ అడుగుతారు. ఒకవేళ కస్టమర్లు కట్టకపోతే కండబలమున్న మనుషుల్ని పంపి వారి వాహనాలను బలవంతంగా లాక్కెళ్లిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి.
చాలామంది తమ అవసరాల కోసం లోన్లు తీసుకొని వాహనాలు కొనుక్కుంటారు. కానీ కొన్నిసార్లు డబ్బులు కట్టలేకపోవడంతో రికవరీ ఏజేంట్ల వచ్చి డబ్బులు కట్టాలంటూ అడుగుతారు. ఒకవేళ కస్టమర్లు కట్టకపోతే కండబలమున్న మనుషుల్ని పంపి వారి వాహనాలను బలవంతంగా లాక్కెళ్లిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి.
అయితే ఈ విషయంపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. లోన్ తీసుకున్న వాహన యజమానులు ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే కండబలమున్న మనుషుల్ని పంపి వాహనాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల తీరును ధర్మాసనం తప్పుబట్టింది. ఇలా చేస్తే ఆ వ్యక్తి జీవించే హక్కు, జీవనోపాధిని కాసరాయటమేనని పేర్కొంది.
లోన్ రికవరీని రాజ్యంగ పరిధిలోని చట్టం ప్రకారం వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై రూ.50 వేలు జరిమాన విధిస్తామని హెచ్చరించ్చింది.