Uncategorized

వీర్యదానం గురించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు.

సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న జంటలకు సహాయం చేయడానికి స్పెర్మ్ కణాలను కలిగి ఉన్న వీర్యాన్ని దానం చేసే ప్రక్రియ వీర్యదానం. విరాళనంగా ఇచ్చిన స్పెర్మ్‌ను గర్భాశయ గర్భధారణ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ వంటి వివిద పునరుత్పత్తి పద్ధతుల్లో ఉపయోగిస్తారు. అయితే సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న జంటలకు సహాయం చేయడానికి స్పెర్మ్ కణాలను కలిగి ఉన్న వీర్యాన్ని దానం చేసే ప్రక్రియ వీర్యదానం.

విరాళనంగా ఇచ్చిన స్పెర్మ్‌ను గర్భాశయ గర్భధారణ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ వంటి వివిద పునరుత్పత్తి పద్ధతుల్లో ఉపయోగిస్తారు.వీర్యదానం అనేది దానిని ఇచ్చే జంటకు తెలియకుండా ఇవ్వొచ్చు, తెలిసీ ఇవ్వొచ్చు. అంటే బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు వీర్యదానం చేయవచ్చు. అలాగే ఎవరు వీర్యదానం చేస్తున్నారో, ఎవరికి వీర్యదానం చేస్తున్నామో తెలియకుండా కూడా స్పెర్మ్ డొనేషన్ చేస్తుంటారు.

వీర్యాన్ని దానం చేసేంత ఆరోగ్యంగా ఉన్నారో లేదో నిర్ధారించడానికి వైద్యులు పలు పరీక్షలు సూచిస్తున్నారు. రక్త పరీక్షలు, రక్తంలో గ్లూకోజు పరీక్షలు, మూత్ర పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు మొదలైనవి అవసరమవుతాయి. ఈ పరీక్షల ద్వారా HIV, AIDS, STD, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి ఉన్నాయో లేదో తెలుస్తుంది.ఈ వైద్య పరీక్షలు అన్నింటిలో ఉత్తీర్ణులైతే అప్పుడే మీరు వీర్యాన్ని ఇవ్వాల్సి వస్తుంది.

ఇక ఆరు నెలలకొకసారి వీర్యాన్ని ఇవ్వొచ్చు..ఇకపోతే ఈ వీర్య దానానికి 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే 45 సంవత్సరాలకు మించి వయస్సు ఉండకూడదు. ఇకపోతే స్క్రీనింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పెర్మ్ ను ఎలా దానం చేయాలో వైద్యులు చెబుతారు. స్మెర్మ్ దానం చేయడానికి ముందు కనీసం 2-4 రోజుల శృంగారానికి, హస్తప్రయోగానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.స్పెర్మ్ దానం చేయడానికి, రిజిస్టర్డ్ స్పెర్మ్ బ్యాంక్ లేదా ఫెర్టిలిటీ క్లినిక్‌కు వెళ్లాలి.

అక్కడ వారు ఒక కంటైనర్ ఇస్తారు. ఒక గదిలోకి వెళ్లి, వారిచ్చిన కంటైనర్ లో స్ఖలనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానిని వారికి అందించాలి.స్మెర్మ్ బ్యాంకులోని ప్రైవేటు గదిలో స్పెర్మ్‌ను దానం చేయడం అసౌకర్యంగా అనిపిస్తే.. ఇంట్లోనే వీర్యాన్ని సేకరించి దానిని గంటలోపు స్మెర్మ్ బ్యాంకులో అందించాలి.. దీనికి ముందు ఎన్నో పరీక్షలను చేస్తారు..మళ్ళీ కూడా వీర్యాన్ని దానం చేయొచ్చు..ఇలా చెయ్యడం వల్ల ఎటువంటి సమస్యలు రావని గుర్తుంచుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker