Health

వయాగ్రా టాబ్లెట్ వాడుతున్నారా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.

వయాగ్రా ఒక అల్లోపతి ఔషధము. దీని అసలు పేరు సిల్డినాఫిల్ సిట్రేట్ . పురుషుల్లో అంగస్తంభన లోపాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక మందు ఇది! అమెరికా ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చి 2014 నాటికి సరిగ్గా పదేళ్లవుతోంది. ఈ దశాబ్దకాలంలో అంతర్జాతీయంగా ఇది సృష్టించిన సంచలనానికి అంతులేదు. అయితే శృంగారంలో రెచ్చిపోవాలని చాలా మంది వయాగ్రా పిల్స్ వాడుతుంటారు. ఒక్కోసారి వీటి ప్రభావం ఎక్కువ సేపు ఉండటం వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. వయాగ్రా అందరూ వాడకూడదని, కేవలం అంగస్తంభన సమస్యలు ఉన్నవారు మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు.

శృంగారంలో పాల్గొనేంత సమర్ధత లేని వాళ్లు కూడా దీన్ని వాడకూడదు. దాని కారణంగా వాళ్లు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాగపూర్‌లో వయాగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి వైద్య పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆరుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్ పరిశోధకులు దీనిపై కేసు నమోదు చేసి గత ఏడాది సెప్టెంబర్‌లో నివేదిక రూపొందించారు. ఈ వారమే ఆన్‌లైన్‌లో ఇది అందుబాటులో ఉంచారు. ఫోరెన్సిక్, లీగల్ మెడిసిన్ జర్నల్‌లో కూడా ఇది ప్రచురితమైంది.

ఈ ఘటనలో మరణించిన 41ఏళ్ల వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవని, అతనికి శస్త్ర చికిత్సలు కూడా జరగలేదని గుర్తించారు. అతడు చనిపోడానికి ముందు రోజు తన స్నేహితురాలితో హోటల్‌లో ఉన్నాడు. 50 ఎంజి చొప్పున రెండు వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు ఆల్కహాల్ సేవించాడు. తెల్లారేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తెల్లవారు జామున వాంతులు చేసుకున్నాడు. ఆస్పత్రికి వెళ్దామని స్నేహితురాలు చెప్పినా వినిపించుకోలేదు. గతంలోనూ ఇలాగే అయిందని చెప్పి ఊరుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

వయాగ్రా పిల్స్ వేసుకోవడం వల్ల క్రమక్రమంగా అతని మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి సెరెబ్రో వాస్కులర్ హెమరేజి ఏర్పడటంతో అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. మెదడులో గడ్డకట్టిన రక్తం 300 గ్రాములు ఉన్నట్టు పోస్టుమార్టమ్ నివేదిక తేల్చింది. అలాగే అతని గుండె నాళాలు గట్టిపడడంతోపాటు కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిన్నట్టు వెల్లడైంది. వైద్యుల సూచన లేకుండా వయాగ్రా వాడకూడదని పరిశోధకులు హెచ్చరించారు. వయాగ్రా పిల్స్ పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి , రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. దీన్ని ఎప్పుడుపడితే అప్పుడు వేసుకోకూడదు. డాక్టర్‌ ఏం చెబితే అదే చేయాలి.. సొంతంగా ఎలా పడితే అలా వాడకూడదు.

ఇలాంటి మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టపరంగా నేరం.హైబీపీ, హైషూగర్ , కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు వయాగ్రా వాడితే ప్రాణాలకే ముప్పు అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటుకు నైట్రేట్ పిల్స్ తీసుకునేవారు వయాగ్రా కనెక్ట్ తీసుకోకూడదు. అలాగే అమిల్ నైట్రేట్ తీసుకునేవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. దీనికి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా చాలా ఎక్కువ. తలనొప్పి, మత్తుగా ఉండటం, చూపు అస్పష్టంగా మారడం, కొందరికి దృశ్యాలు నీలిరంగులో కనిపించవచ్చు. మొహం వేడెక్కడం, ఎర్రబారటం , ముక్కుదిబ్బడ, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ నొప్పి, పిట్స్‌రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మొహం, కనురెప్పలు వాయడం కూడా జరుగుతుంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker