News

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్‌కు ముహూర్తం ఫిక్స్.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరుణ్ తేజ్ పెళ్లి మ్యాటర్ పై ఎప్పటినుంచో జనాల్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకానొక సందర్భంలో మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తను మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా తెలపడంతో ఈ టాపిక్ జనాల్లో హాట్ ఇష్యూ అయింది. అయితే మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయం పై మెగా ఫ్యామిలీ, వరుణ్ తేజ్ స్పందించలేదు. కానీ ఒకటి రెండు సార్లు లావణ్య త్రిపాఠి మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటిది లేదు. మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెగా వరుణ్ తేజ్ పెళ్లికి రంగం సిద్ధం. తన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయనున్నారట.

నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారని వార్త వైరల్ అవుతుంది.. వీరి ఎంగేజ్మెంట్ అంటూ ప్రముఖ బాలీవుడ్ మీడియా…జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందని.. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. వధూవరుల దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలి అధికారికంగా ప్రకటించలేదు.

కేవలం సోషల్ మీడియాలో మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక ఇందుకు నిజమేంత ఉందో తెలియాలంటే మాత్రమే జూన్ 9 వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఇకపోతే వీరిద్దరు జంటగా మిస్టర్ మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు.

ఇటీవల లావణ్య పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది కూడా సక్సెస్ కాలేదు.ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker