పెళ్లి తర్వాత లావణ్యను ఆ ప్రశ్న అడగలేకపోతున్న అంటూ అసలు విషయం చెప్పిన వరుణ్ తేజ్.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ లవ్ స్టోరీ చివరి నిమిషం వరకూ పెదనాన్న చిరంజీవికీ తెలియదట. ఈ విషయాన్ని అతడు చెప్పాడు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ అడిగిన ఓ ప్రశ్నకు చిరు స్పందించాడు. మామూలుగా చిరు లీక్స్ పేరుతో మెగాస్టార్ తన మూవీ టైటిల్స్, స్టోరీలాంటివి చిరంజీవి ముందుగానే లీక్ చేస్తూ ఉంటాడు. అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ అనే సినిమాలో వరుణ్, లావణ్య కలిసి నటించారు.
ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా కాలం వీరి ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఆతర్వాత సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ ఇద్దరు.. పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య సినిమాలను కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవలే ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు లావణ్య. ఇదిలా ఉంటే తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..
ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి తర్వాత లావణ్యతో మీరు కలిసి నటిస్తారా? అన్న ప్రశ్నకు వరుణ్ ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ చెప్పారు. కథకు మేము సరిగ్గా సరిపోతామని అనుకుంటే తప్పకుండా చేస్తామని అన్నారు వరుణ్. దర్శకుడు రాసుకున్న కథకు మేము సరిపోతే మేము చేయడానికి రెడీగా ఉన్నాం అని తెలిపారు వరుణ్. ఎదో చేసేయాలని తొందరపడి సినిమాలు చేయం అని తెలిపారు.
అలాగే వరుణ్ చేసిన వాటిలో లావణ్యకు ఏ సినిమా అంటే ఇష్టమని ప్రశ్న ఎదురవ్వగా .. ఇప్పటివరకు లావణ్యను నేను ఈ ప్రశ్న అడగలేదు అని సమాధానం చెప్పారు వరుణ్ తేజ్. ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.