రాంగోపాల్ వర్మతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ఎస్.ఎస్. క్రియేషన్స్ నిర్మించిన రావుగారిల్లు, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకి సహాయ నిర్దేశకునిగా మొదలు పెట్టారు. తెలుగు, భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు. అయితే ఆడవాళ్లను ఆటబొమ్మలుగా చూడటం డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు అలవాటు అనే విమర్శలు బోలెడున్నాయి. తాజాగా ఆయన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా అవి చర్చనీయాంశమయ్యాయి.
రామ్ గోపాల్ వర్మ ఓ అమ్మాయితో కలిసి క్లబ్‌లో న్యూ ఇయర్ పార్టీని జరుపుకున్నాడు. ఈ పార్టీకి సంబంధించిన చిత్రాలు, వీడియోలను ఆర్జీవీ స్వయంగా ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోలో బెస్ట్ ఏంటి అని ప్రశ్నించాడు. అయితే ఈ అమ్మాయి ఎవరో, ఆమె పేరు లేదా ఎలాంటి సమాచారాన్నీ పోస్ట్ ద్వారా ఆర్జీవీ వెల్లడించలేదు.
వీడియోలో, డీజే పార్టీ సందర్భంగా ఆర్జీవీ, ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. పార్టీ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ గ్లాస్ నుంచి నీటిని అమ్మాయి శరీరంపై పోశాడు. ఆమె శరీరంపై మద్యం పోసి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ దర్శకుడిపై ఘాటైన స్పందన వచ్చింది.
దర్శకుడు మద్యం సేవించి అపస్మారక స్థితిలో ఉన్నాడనీ, అలాంటి చిత్రాలు, వీడియోలను ప్రజల ముందు ఎందుకు బహిర్గతం చెయ్యలనే విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో, ఈ అమ్మాయి ఎవరనే సందేహం జనాలకు వచ్చింది. రామ్ గోపాల్ వర్మ నెక్ట్స్ చిత్రంలో ఈ అమ్మాయి హీరోయిన్‌గా కనిపించనుందనే వ్యాఖ్యలు వచ్చాయి. కొంత సస్పెన్స్ తర్వాత రాంగోపాల్ వర్మే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు.
తనతో ఉన్న అమ్మాయి నటి, మోడల్ సిరి స్టాజీ అని చెప్పాడు. రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ పార్టీ హైదరాబాద్‌లోని మకావో క్లబ్‌లో జరిగింది. సిరి స్టాజీ ఇదివరకు వర్మతో ఓ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో వర్మపై తన ఫీలింగ్స్ బయటపెడుతూ ఆయన పర్మిషన్ తీసుకొని మరీ హగ్ ఇచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ న్యూఇయర్ పార్టీలో కనిపించింది.