News

వరలక్ష్మీ పెళ్లి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసారో చెప్పిన తండ్రి శరత్‌కుమార్‌.

వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తే సినిమా హిట్ అని చాలామంది భావిస్తారు. విలన్ రోల్స్ లో, నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలలో ఆమె ఎక్కువగా నటించినా తన నటనతో ఆమె తన పాత్రలకు ప్రాణం పోశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లికి ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది.

అనంతరం చెన్నైలో ఘనంగా రిసెప్షన్‌ కార్యక్రమాన్ని జరిపించారు. అందులో భారత చిత్రపరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే వరలక్ష్మీ పెళ్ల ఖర్చు గురించి తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముంబైలో అత్యంత సంపన్నులలో ఒకరైన నికోలాయ్ సచ్‌దేవ్ అక్కడ తన సొంత ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు. దీంతో ఆయనకు దాదాపు రూ 900 కోట్ల ఆస్తులున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న నికోలాయ్‌కు 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంది.

ఈ క్రమంలో వరలక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. వరలక్ష్మీ వివాహం థాయ్‌లాండ్‌లో ఘనంగా జరిగింది. ఆపై చెన్నైలోని తాజ్‌ హోటల్‌లో రిషప్షన్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు వచ్చారు. ఇందుకోసం వారు భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. నికోలాయ్ తన భార్యకు బంగారు చెప్పులు, డైమండ్ చీరను బహుమతిగా ఇచ్చాడని వాటి విలువే రూ.200 కోట్లు పైగానే ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. పెళ్లి కోసం సుమారు రూ. 200 కోట్లకు పైగానే శరత్‌కుమార్‌ ఖర్చు చేశారంటూ రూమర్స్‌ వ్యాప్తి చెందాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker