వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు కాబోయే భర్తకు ఇది రెండో పెళ్ళా..? వెలుగులోకి షాకింగ్ విషయాలు.
వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. తమిళ్ సినిమాల్లో నటించడం ప్రారంభించి సౌత్ మొత్తాన్ని చుట్టేసింది. ఇప్పుడు తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో మంచి మంచి ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఒక మంచి బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే పెళ్లి వద్దన్న వరలక్ష్మి తాజాగా తన నిశ్చితార్థం ఫొటో షేర్ చేసి అందరికి షాకిచ్చింది.
నికోలయ్ సచ్ దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ యజమానితో వరలక్ష్మీ నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక వరలక్ష్మీ కాబోయే భర్త కావడంతో.. నికోలయ్ కూడా ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. దాంతో ఎవరతను.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నికోలయ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.
అది ఏంటంటే.. ఇతగాడికి అంతకుముందే పెళ్లి అయ్యినట్లు అభిమానుల పరిశోధనలో వెల్లడైందట. అతడి మొదటి భార్య పేరు కవిత సచ్ దేవ్ అని.. ఆమె ఒక మోడల్ అని తెలుస్తోంది. ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతోంది. అయితే వీరిద్దరికి అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారని సమాచారం. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ఏంటీ.. వరలక్ష్మీ కాబోయే భర్తకు ముందే పెళ్లయ్యిందా .. అంటూ ఆశ్చర్యపోతుర్నారు. ఇంకొంతమంది ఇప్పుడు ఇదే ఫ్యాషన్ గా మారింది. ఏదైనా వీళ్లయినా హ్యాపీగా ఉంటే చాలు అని కామెంట్ చేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. వరలక్ష్మీ లేదా ఆమె కాబోయే భర్త ఈ వార్తలపై స్పందించాలి.