Health

ఈ నూనె వంటల్లో వాడితే ఎంత ప్రమాదమో తెలుసా..? ఒక్కసారి వాడితేనే..?

వంట నూనె.. తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొందరు మోసగాళ్లు కల్తీ నూనెను తయారు చేస్తున్నారు. అసహజ పద్ధతుల్లో నూనెను తయారు చేస్తూ మార్కెట్లోకి వదులుతున్నారు. ఇక విడిగా కొనుగోలు చేస్తేనే కదా ఈ సమస్య అనుకునేరు.. ఎందుకంటే కొందరు అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రాండెండ్‌ కంపెనీల పేరుతో నకిలీ నూనెను మార్కెట్లోకి వదులుతున్నారు.

అయితే అయితే వంటనూనెలో మనం ఏ ఆయిల్ ను ఉపయోగిస్తాం..? ఏ ఆయిల్ మానకు ఆరోగ్యాన్ని ఇస్తుంది..? అనే సందేహాలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ లను ఎక్కువగా మనం వంటల్లో వినియోగిస్తాం. వీటితో పాటు ఆవ నూనెను కూడా చాలామంది వంటల్లో వినియోగిస్తారు. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఆవనూనె వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని తేలింది.

చాలామంది ఆవనూనె వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని భావించి ఆవనూనె ఖరీదు ఎక్కువైనప్పటికీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. టెంపుల్ యూనివర్శిటీకి చెందిన లూయీస్ క్యాట్జ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆవ నూనె గురించి పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఎవరైతే ఆవ నూనెను వంటల్లో వాడతారో వాళ్లలో మెదడు చురుకుగా పని చేయదని, జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ వివరాలను వెల్లడించారు. ఆవ నూనెను వినియోగించే వాళ్లు బరువు కూడా పెరుగుతారని చెప్పారు. పచ్చళ్ల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్న ఈ నూనెను వాడకపోవడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఎలుకలపై ఏడాది పరిశోధనలు చేయగా ఆవ నూనె తీసుకున్న ఎలుకల్లో జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు అమీలాయిడ్ ఫలకాల స్థాయి పెరిగినట్టు గురించారు. ఆవ నూనె వల్ల న్యూరాన్ల పనితీరు దెబ్బ తిన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే ఆవ నూనె వల్ల ప్రయోజనం లేకపోయినా ఆలివ్ నూనె వాడితే మాత్రం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker