Health

వంట నూనెను ఒకసారి కన్నా ఎక్కువ వాడితే ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా..?

వాడిన వంట నూనెతో తిరిగి ఆహారాన్ని వండటం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ పెరుగుతాయని, ఇది మంటను కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహంతో సహా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. క్యాన్సర్‌, అధిక బరువు, గుండె జబ్బులు, చెడు కొవ్వు పదార్థాలు ఎక్కువ అవుతాయి.

అయితే నూనె లేకపోతే ఏ కూరను వండుకోలేం. కూరలు రుచిగా ఉండవు. ఇక మనకు మార్కెట్‌లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ స్థోమత, అభిరుచులకు తగిన విధంగా వంట నూనెలను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే చాలా మంది వంట నూనెలను పదే పదే వేడి మరీ ఉపయోగిస్తుంటారు. వంట నూనెలను పదే పదే వేడి చేసి ఉపయోగించడం వల్ల వాటిల్లో కార్సినోజెన్లు అనబడే పదార్థాలు ఉత్పన్నమవుతాయి.

ఇవి విషంతో సమానం. ఈ క్రమంలో అలాంటి నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. అలాగే స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. పదే పదే వేడి చేసిన వంట నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

ఎక్కువ సార్లు వేడి చేయబడిన వంట నూనెతో అసిడిటీ సమస్య వస్తుంది. శరీర జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. చాలా సార్లు వేడి చేసిన నూనెను ఉపయోగిస్తే క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందని పలువురు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కనుక ఏ వంట నూనె అయినా సరే కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker