News

సొంతవాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు, చివరికి మా నాన్న కూడా..?

తమిళనాట సంచలాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వనిత విజయ్ కుమార్. ముఖ్యంగా మూడు నాలుగు పెళ్ళిళ్ళతో వనిత హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ప్రతీ పెళ్ళి పెటాకులు కావడం.. కోలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా వనితాకు పేరు ఉంది. తమిళ బిగ్ బాస్ లో కూడా ఆమె సందడి చేసింది. అయితే సీనియర్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కోలీవుడ్ అయినా తెలుగులో కూడా మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యాడు.

ఇక తెలుగు నటి మంజులను వివాహమాడి మరింత దగ్గరయ్యాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు. వనితా విజయ్ కుమార్, ప్రీతీ విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్.. ఇక హీరో అరుణ్ విజయ్ కూడా ఆయన కుమారుడే. వీరందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్నవారే. ఇక వీరందరి కన్నా వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయ్యింది వనితా విజయ్ కుమార్. రుక్మిణి అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన వనితా.. ఆ తరువాత కోలీవుడ్ లో మంచి సినిమాలు తీసి మెప్పించింది.

ఇక దేవి సినిమా తరువాత ఆమెకు వివాహం కాగా, అప్పటినుంచి ఆమె ఇంటికే పరిమితమయ్యింది. ఆ తరువాత తన భర్తతో విబేధాలు.. పిల్లల కోసం పోరాటంతో మీడియా ముందుకు వచ్చింది. ఈ వివాదం కాగానే.. తండ్రి ఆస్తి తగాదాలతో మరింత వివాదాస్పదమయ్యింది. ఇక ఇప్పుడు ఆమె నరేష్- పవిత్ర జంటగా నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో రమ్య రఘుపతి పాత్రలో నటించింది. ఈ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గతం తాలూకూ చేదు జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది.

ఆస్తి కోసం సొంత వాళ్ళే తనను ఇంటి నుంచి గెంటేసినట్లు చెప్పుకొచ్చింది. “నా తండ్రికి, నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వన్నని ఆయన ముఖం మీద చెప్పాడు. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. ఆమె ఉన్నప్పుడు వీరెవ్వరు మాట్లాడేవారు కాదు. ఆమె చనిపోయాక నన్ను వీళ్ళు దూరం పెట్టారు. ఇంటి నుంచి గెంటేశారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక మైసూర్ లో పిల్లతో కలిసి చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపాను.

ఇక ఒకరోజు మా నాన్నకు కాల్ చేసి.. ఎందుకు నాన్న .. అన్ను ఇలా వేధిస్తున్నారు.. అమ్మ ఉంటే నాకు ఇలా జరగనిచ్చేదా అని అడిగితే.. తమిళనాడులో నువ్వు కాలు కూడా పెట్టలేవు. ఒకసారి వచ్చి చూడంటూ సవాలు విసిరారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker