సాయం కోసం వెళ్తే వాణిశ్రీని అవమానించిన స్టార్ హీరో తండ్రి. సాయం చేసిన కృష్ణం రాజు.
రత్నకుమారి గా ఆమె చిన్నతనం నుంచి పెరగగా సినిమా లోకి రాగానే వాణిశ్రీ గా పేరు మార్చుకుంది ఈమె. తమిళ కన్నడ మలయాళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల లో మరపురాని ముద్రను వేసుకుంది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్ర తో మంచి పేరు తెచ్చుకున్న నటి గా సెట్ అయ్యింది. అయితే వాణిశ్రీ కూడా అందరిలాగే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. టాలీవుడ్ లో ఆమెకి కృష్ణం రాజుతో.. ఏఎన్నార్ ఫ్యామిలీతో మంచి అనుభందం ఉంది. అదే విధంగా మూవీ మొఘల్, విక్టరీ వెంకటేష్ తండ్రి రామానాయుడుతో కూడా ఆమెకి మంచి అనుభందం ఉంది.
అయితే ఒక సందర్భంలో రామానాయుడు ప్రవర్తించిన విధానం వల్ల ఆమె భాదపడిందట. ఈ విషయాన్ని స్వయంగా వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రామానాయుడు నిర్మాణంలో వాణిశ్రీ అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. వెంకటేష్ హీరో అయ్యాక బొబ్బిలి రాజా చిత్రంలో కీలక పాత్రలో నటించింది. వెంకటేష్ తో, అలాగే రామానాయుడు ఇద్దరితో ఆమె చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఒక సందర్భంలో వాణిశ్రీకి ఆస్తి విషయంలో తీవ్రమైన సమస్య ఏర్పడిందట. రామానాయుడుకి అప్పట్లో రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. సమస్య పరిష్కరిస్తారని ఆయన దగ్గరకి వెళ్లిందట.
కానీ ఆయన ఒక్కసారిగా మనిషి మారిపోయారు అనిపించింది. వెళ్లి సురేష్ ని అడుగు అని రామానాయుడు సరిగ్గా సమాధానం చెప్పలేదట. ఇలా ఎలా మారిపోతారు మనుషులు అని వాణిశ్రీ ఆశ్చర్యపోయిందట. అయితే తన సమస్య తెలుసుకుని సాయం చేసిన వ్యక్తి కృష్ణంరాజు గారు అని వాణిశ్రీ తెలిపింది. అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. నాకు జీవితంలో అతి గొప్ప సాయం చేసిన వ్యక్తి ఎవరంటే అది కృష్ణం రాజు గారే అని వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. గతంలో ఎన్టీవీలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. వాణిశ్రీ, కృష్ణం రాజు అనేక చిత్రాల్లో కలసి నటించారు.
కృష్ణం రాజు కెరీర్ లోనే క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం భక్త కన్నప్పలో వాణిశ్రీ నటించింది. అదే విధంగా కృష్ణవేణి, జీవనతరంగాలు లాంటి చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు కూడా వాణిశ్రీపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు తనకి ఇష్టమైన నటీమణులలో వాణిశ్రీ కూడా ఒకరు అని తెలిపారు. సెట్స్ బయట ఏదో సరదాగా ఉన్నట్లు ఉంటుంది. కానీ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా వచ్చి సింపుల్ గా డైలాగ్ చెప్పేస్తుంది అని కృష్ణంరాజు అన్నారు.